జులై 8 న కొత్త పార్టీ : మొగ్గుచూపుతున్న షర్మిళ – ఆ తేదీ వద్దంటున్న నేతలు

ys sharmila new party launch dates announced

తెలంగాణలో వై.యస్.షర్మిళ కొత్తగా పార్టీ పెడుతున్నారనే విషయం ప్రతి ఒక్కరి నోట నానుతున్న విషయం తెలిసిందే. కొత్త పార్టీ పెడుతున్నారంటూ వస్తున్న వార్తలకు బలం చేకూరుస్తూ జిల్లా నేతలతో షర్మిళ వరుస సమావేశాలు అవుతున్నారు.

అయితే పార్టీని ఎప్పుడు ప్రకటించాలనే అంశంపై షర్మిళ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. జులై 8న అధికారికంగా పార్టీని ప్రకటించాలని షర్మిళ పర్టీ పేరును అధికారికంగా ప్రకటించడానికి ఫిక్స్ అయిపోయారు. జులై 8న వైయస్ రాజశేఖర్ రెడ్డి పుట్టిన తేదీ కాబట్టి ఆరోజు ప్రకటిస్తే బాగుంటుందనేది షర్మిళ ఆలోచనగా సన్నిహితులు చెబుతున్నారు.

ఆలస్యమవుతుందన్న నేతలు మే 14న అయితే బెటర్

పార్టీలో ఇప్పటికే ఉన్న కీలక నేతలు, జిల్లాలో ఉండే వైసీపీ కార్యకర్తలు మాత్రం జులై 8 అంటే చాలా ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. అందుకు ప్రతిగా మే14 న పార్టీ ప్రకటిస్తే పాదయాత్ర చేయడానికి, పార్టీని బలంగా నిర్మించుకోవడానికి సమయం ఉంటుందని కోరుతున్నారు. మే 14 అంటే రాజశేఖర రెడ్డి సీఎంగా మొదటిసారి ప్రమాణస్వీకారం చేసిన రోజు, కాబట్టి ఆ రోజు కూడా బాగుంటుందని చెబుతున్నారు.

కార్యకర్తలు, కీలక నేతలు మే14 కు మొగ్గు చూపుతుండగా , షర్మిళ మాత్రం జులై 8 కే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైన షర్మిళ పార్టీ ఎప్పుడు అనేదానికి సమాధానంగా జూలై8 లేదా మే14 అనే రెండు తేదీల్లో ఏదో ఒకటి కావచ్చనేది స్పష్టం అయింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు