పోలవరం దగ్గర వైఎస్ తోపాటు బీజేపీ కోరిన విగ్రహం కూడా..

పోలవరం దగ్గర వైఎస్ తోపాటు బీజేపీ కోరిన విగ్రహం కూడా..

పోలవరం దగ్గర వైఎస్ తోపాటు బీజేపీ కోరిన విగ్రహం కూడా..

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం.. పూర్తి చేయటం అంశంపై ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. కరోనా సమయంలో అత్యంత వేగంగా పనులు చేస్తూ వస్తుంది. ఇప్పటికే అన్ని గేట్లు ఏర్పాటు చేసింది. ఈ ఖరీఫ్ నాటికి నీళ్లు ఇస్తామని చెప్పినా.. కరోనా కారణంగా పనుల్లో ఆలస్యంతో.. ఇది సాధ్యం కాలేదు. ఇదే సమయంలో నిధుల కొరత ఏపీ ప్రభుత్వాన్ని వేధిస్తోంది.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బిల్లుల చెల్లింపును నిలిపివేసింది. వెయ్యి 303 కోట్లు బిల్లు పంపిస్తే.. కేవలం 333 కోట్ల రూపాయలు మాత్రమే పంపిస్తామని.. 532 కోట్లతో సంబంధం లేదని స్పష్టం చేసింది. మరో 128 కోట్ల రూపాయల బిల్లులను వెనక్కి పంపింది. పోలవరం ప్రాజెక్టు బిల్లులు వెనక్కి వచ్చిన.. ఐదు రోజులకు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఈ టూర్ లో పోలవరం ప్రాజెక్టు నిధుల అంశమే ప్రధాన ఎజెండా అని స్పష్టం అవుతుంది.

పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అనే విషయం అందరికీ తెలిసింది. ఈ విషయాన్ని మళ్లీ గుర్తు చేస్తూ.. ఏపీ ప్రభుత్వం ఓ ఆఫర్ బీజేపీకి ఇచ్చిందంట. పోలవరం ప్రాజెక్ట్ ప్రారంభించిన వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేయటం జరుగుతుంది.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసిన బీజేపీ విగ్రహం సైతం పెడతాం.. బీజేపీ వాళ్లు కోరుకున్న విగ్రహం పెడతాం అని హామీ ఇవ్వబోతుందంట. ఏపీలో బీజేపీ పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించి ఒక్క పని చేసిన చారిత్రక ఆధారాలు, విలువ లేదు. ఏపీలో పార్టీ బలపడాలి అంటే బీజేపీకి చారిత్రక ఆధారాలు ఉండాలి.. దీన్ని దృష్టిలో ఉంచుకుని వాజపాయి లేదా బీజేపీ పార్టీ సూచించిన వారి విగ్రహం సైతం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాటన్ బ్యారేజ్ కట్టిన కాటన్ దొరను దశాబ్దాలుగా గుర్తు పెట్టుకున్నారు ఏపీ ప్రజలు.. పోలవరం ప్రాజెక్టు ప్రారంభించిన వైఎస్ఆర్ ను గుర్తు పెట్టుకున్నారు.. అదే విధంగా ఆ ప్రాజెక్టు పూర్తి చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకుంటారు.. ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల్లో బీజేపీకి ఉన్న మైలేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.. ఇప్పుడు కానీ పోలవరం ప్రాజెక్టుకు నిధులు ధారాళంగా ఇచ్చి.. ప్రాజెక్టు పూర్తి చేసినట్లయితే.. జాతీయ ప్రాజెక్టు హోదాలో బీజేపీ విగ్రహం పెడతాం అనే ప్రపోజల్ ఏపీ నుంచి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

దీనిపై బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత కంటే వాళ్లకు మరో ఆప్షన్ ఉండకపోవచ్చు కదా..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు