ప్రత్యేక హోదా ఇస్తే.. తిరుపతి పోటీ నుంచి తప్పుకుంటాం

ప్రత్యేక హోదా ఇస్తే.. తిరుపతి పోటీ నుంచి తప్పుకుంటాం.. ఎన్నిక బరి నుంచి తప్పుకుంటాం.. పోటీ చేయం అని బీజేపీకి సవాల్ విసరబోతుంది. మీరు పోరాడాల్సిన అవసరం లేకుండానే.. బీజేపీ అభ్యర్థిని గెలిపించి లోక్ సభకు

ysrcp big offer to bjp in tirupati by poll election
ysrcp big offer to bjp in tirupati by poll election

ఏపీలోని తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో ఊహించని ట్విస్ట్.. ఎవరూ సాహసించని నిర్ణయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంది. ముఖ్యంగా బీజేపీ – జనసేన పార్టీని ఒక్కటికి కోలుకోలేని దెబ్బ కొట్టటానికి రెడీ అయిపోయింది. ప్రచారంలో ప్రధాన అస్త్రంగా ప్రత్యేక హోదాను తెరపైకి తెచ్చి.. టీడీపీతో సహా అన్ని పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది వైసీపీ.

ప్రత్యేక హోదా అంశంలో ఎవరు అవునన్నా.. కాదన్నా.. ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే పోరాటం జరుగుతుంది. ప్యాకేజీకి ఒప్పుకుని హోదా నినాదానికి శాశ్వతంగా సమాధి కట్టుకున్నది టీడీపీ. హామీ ఇచ్చి యూటర్న్ తీసుకుంది బీజేపీ.. ఆ పార్టీతో పెట్టుకుని సైలెంట్ అయ్యిపోయింది జనసేన పార్టీ. ఇక మిగిలింది కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ. ఈ మూడు పార్టీలు ఉన్నాయా అన్నంతంగా ఏపీ ప్రజలు తిరస్కరించారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే ఎవరికీ లేని ఛాన్స్ తో.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే పెద్ద సవాల్ వస్తోంది.

తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. తిరుపతి ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకుంటాం.. పోటీ చేయం అని బీజేపీకి సవాల్ విసరబోతుంది. మీరు పోరాడాల్సిన అవసరం లేకుండానే.. బీజేపీ అభ్యర్థిని గెలిపించి లోక్ సభకు పంపిస్తాం.. ప్రత్యేక హోదా ఇవ్వండి.. పోటీ లేకుండా గెలవండి.. ఆ దమ్ముందా బీజేపీకి సవాల్ విసరబోతుంది.

ఇప్పటికే అన్ని పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయటం.. ప్రచారం ప్రారంభించటం జరిగిపోయాయి. ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తీసుకురావటం వల్ల.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ – జనసేన పార్టీని చావుదెబ్బ కొట్టాలని డిసైడ్ అయ్యి.. ఈ స్లోగన్ ఎత్తుకోనున్నట్లు సమాచారం. ప్రత్యేక హోదా కంటే ఓ ఎంపీ సీటు ముఖ్యం కాదు మాకు.. మీరు హోదా ఇస్తాం అంటే మా అభ్యర్థి బరి నుంచి తప్పుకుంటారు.. మీకు దమ్ము, ధైర్యం ఉంటే హోదా ప్రకటించండి అని బీజేపీకి సవాల్ చేయనుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.

దీనిపై బీజేపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.. ఎందుకంటే ఇప్పటికే ఒకటికి పది సార్లు చెప్పింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. హోదా హామీ చచ్చిపోయింది అని.. మరి లోకల్ లీడర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.. జనం మాత్రం బాగా క్లారిటీగా ఉన్నారు..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు