అర్జంట్ గా హైదరాబాద్ వెళ్లిపో – వైసీపీ ఎమ్మెల్యేకు హైకమాండ్ వార్నింగ్

ఆమె వివరించే ప్రయత్నం చేసినా.. అవన్నీ తర్వాత చూసుకుందాం.. ముందు మేం

ఏందీ గోల.. ఏం మాట్లాడుతున్నారో.. ఎవరితో.. ఎప్పుడు ఎలా వాగుతున్నారో మీకు అర్థం అవుతుందా.. ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా.. అర్జంట్ గా మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోంది.. హైదరాబాద్ వెళ్లి అక్కడే ఉండండి.. మేం చెప్పే వరకు మళ్లీ రావొద్దు.. వైసీపీ ఎమ్మెల్యేకు హైకమాండ్ వార్నింగ్ ఇలా ఇచ్చిందంట. ఆ వెంటనే ఆ ఎమ్మెల్యే ఏపీ నుంచి తెలంగాణలోని హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది..

ఈ ఎమ్మెల్యే ఎవరో కాదు తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి. ఇటీవల ఈమె ఆడియో టేపులు సంచలనం అయ్యింది. అధికార పార్టీనే ఇరుకున పెడుతున్నాయి. పేకాట, ఆ తర్వాత ఫైనాన్షియర్ పై కేసులు, ఇప్పుడు ఆడియో టేపులు.. ఇలా వరస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేకు ఆర్థికంగా, రాజకీయంగా సాయం చేసిన వారే ఇప్పుడు రివర్స్ కావటంతోపాటు ఎమ్మెల్యే శ్రీదేవి వ్యవహారశైలి పార్టీని ఇరకాటంలోకి నెడుతోంది. మొన్నటికి మొన్న పేకాట వార్తపై న్యూస్ ఛానళ్లపై ఏకంగా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారు.. చరిత్రలో ఎప్పుడూ ఇలాంటివి చూడని మీడియా సైతం ఇప్పుడు వ్యతిరేకంగా ఉంది.

ఇవన్నీ పరిశీలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్.. ఆమెను వెంటనే హైదరాబాద్ వెళ్లిపోవాలని.. నియోజకవర్గంలో ఉండొద్దని వార్నింగ్ ఇచ్చి పంపించారు అంట. కొన్నాళ్లు మాట్లాడొద్దని.. అన్ని చక్కబడిన తర్వాత చూసుకుందాం అని నచ్చజెప్పి పంపించారంట. మళ్లీ చెప్పేవరకు తాడికొండ రావొద్దని కూడా చెప్పారంట.. ఈ సంఘటనలపై ఆమె వివరించే ప్రయత్నం చేసినా.. అవన్నీ తర్వాత చూసుకుందాం.. ముందు మేం చెప్పినట్లు చేయండి అని సాగనంపారంట..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు