ఏప్రిల్ 10న జెడ్పీటీసీ – ఎంపీటీసీ ఎన్నికలు

ఏప్రిల్ 10న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు

zptc, mptc elections held in april 10th in andhra pradesh
zptc, mptc elections held in april 10th in andhra pradesh

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడుగా ఉంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ దగ్గర బ్రేక్ పడిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను వీలైనంత త్వరగా ముగించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కోరింది. అయితే ఆయన మాత్రం నిరాకరించారు. నా హయాంలో నిర్వహించలేనని స్పష్టం చేశారు. దీనికితోడు మార్చి నెలాఖరుకు నిమ్మగడ్డ పదవీ కాలం ముగిసి.. కొత్త ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని వస్తున్నారు.

ఏప్రిల్ ఒకటో తేదీన నీలంసాహ్ని బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ వెంటనే ఆగిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఏకగ్రీవాలకు హైకోర్టు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో.. ఇక పోలింగ్ నిర్వహించటం ఒక్కటే మిగిలి ఉంది. ఈ క్రమంలో.. ఏప్రిల్ 10న జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ నిర్వహించే విధంగా షెడ్యూల్ రానున్నట్లు సమాచారం.

నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. ఏప్రిల్ 2 లేదా 3వ తేదీ కొత్త షెడ్యూల్ ప్రకటించనున్నారని.. ఏప్రిల్ 10న పోలింగ్ జరగనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు సంకేతాలు వెళ్లాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ మేరకు నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ప్రిపేర్ అయ్యి ఉండాలనే అలర్ట్ కూడా వెళ్లినట్లు చెప్పుకుంటున్నారు.

ఏప్రిల్ 17వ తేదీన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది.. ఈలోపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ కూడా ముగించేసి.. ఆ తర్వాత వ్యాక్సినేషన్ ప్రక్రియపై దృష్టి పెట్టాలనేది ప్రభుత్వం నిర్ణయంగా ఉంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు