వైద్యం పేరుతో మూడు నెలలుగా అత్యాచారం, గర్భం దాల్చిన బాలిక

వైద్యం పేరుతో మూడు నెలలుగా అత్యాచారం, గర్భం దాల్చిన బాలిక

ఆరోగ్యం బాలేదని బాబా దగ్గరకు తీసుకెళ్తే అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు దుర్మార్గుడు.. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికలు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు బాబా దగ్గరకు తీసుకెళ్లారు..

ఈ రోగం తాను నయం చేస్తానని రోజు వైద్యం చేయడం ప్రారంభించాడు. గత మూడు నెలలుగా బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేస్తున్నాడు.. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలోనే బాలిక గర్భం దాల్చింది.. కడుపునొప్పి అని ఇంట్లో చెప్పడంతో తల్లిదండ్రులు బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు గర్భవతని తెలిపారు.

దింతో తల్లిదండ్రులు బాలికను నిలదీయగా, బాబా అత్యాచారం చేశాడని తెలిపింది. దింతో కుటుంబ సభ్యులు బంధువులు వెళ్లి బాబాకు దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పిర్యాదు స్వీకరించిన పోలీసులు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి స్టేషన్ కు తరలించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి