బిగ్ బాస్ నుంచి నోయెల్ అవుట్

బిగ్ బాస్ నుంచి నోయెల్ అవుట్

అనూహ్యంగా బిగ్ బాస్ నుంచి నోయెల్ వెళ్ళిపోయాడు. అనారోగ్య కారణంలతో తాను హౌస్ నుంచి వెళ్ళిపోతున్నట్లుగా తెలిపారు. అయితే నోయెల్ వెళ్ళిపోతారు అనే విషయం గత కొద్దీ రోజులుగా వినిపిస్తూనే ఉంది. తాను ‘ఆంక్లియో స్పాంటిలైటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. దీని వలన ఉదయం లేవగానే అరగంట వరకు కళ్ళను స్ట్రెస్ చేసుకుంటున్నారు నడుస్తానని తెలిపారు.

ఇక హౌస్ నుంచి బయటకు వెళ్లిన అనంతరం హౌస్ లోని కొందరిపై విమర్శలు గుర్పించారు. అందులో అవినాష్, మాస్టర్ తన కాళ్ళను చూసి నవ్వేవారని తెలిపారు. దింతో అవినాష్, మాస్టర్ నోయెల్ పై సీరియస్ అయ్యారు. దింతో నాగార్జున కలుగచేసుకొని సర్దిచెప్పారు.

ఇక ఈ మధ్య సినిమా షూటింగ్ కోసం కులూమనాలికి వెళ్లిన నాగ్ అక్కడి నుంచి హౌస్ లోని వారికి బట్టలు తెచ్చారు. ఇక ఎలిమినేషన్ పై వస్తున్న ప్రశ్నలకు నాగార్జున సమాధానం చెప్పారు. ఎవరిని కావాలని ఎలిమినేట్ చెయ్యరని. ప్రేక్షకులు వారికి వేసిన ఓట్లను బట్టే ఎలిమినేట్ చేస్తారని తెలిపారు నాగ్,

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు