వినియోగదారులకు శుభవార్త.. ఉల్లి రేటు తగ్గింది..

వినియోగదారులకు శుభవార్త.. ఉల్లి రేటు తగ్గింది..

దేశంలో అకాల వర్షాలు వ్యవసాయాన్ని కుదేలు చేశాయి. అన్ని పంటలపై వర్ష ప్రభావం పడింది. దింతో కూరగాలయ ధరలు ఆకాశాన్ని అంటాయి. ఎప్పుడు 10 నుంచి 20 మధ్య ఉండే టమాటా 50 పలుకుతుంది. ఇక ఉల్లిధర ఆకాశాన్ని అంటింది. ఉల్లి అత్యధికంగా పండే మహారాష్ట్రలో వర్షాలు అధికంగా రావడంతో రేటు భారీగా పెరిగింది..

ఉల్లి కొరత వస్తుందని ముందే ఊహించిన కేంద్ర ప్రభుత్వం ఎగుమతులు నిలిపివేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఉన్న నిలువలను గుర్తించి ఆయా రాష్ట్రాలకు పంపే ఏర్పాట్లు చేసింది.. ఇక ఈ నేపథ్యంలోనే రేట్లను తగ్గించేందుకు కేంద్రం మహారాష్ట్రలో నిల్వ చేసిన బఫర్ స్టాక్ ను తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.

బఫర్ స్టాక్ నుంచి అస్సాం, ఆంధ్రప్రదేశ్, బీహార్, చండీగర్, హర్యానా, తెలంగాణ, తమిళనాడు మొత్తం 8,000 టన్నుల ఉల్లిని తీసుకుంటున్నాయని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి లీలా నందన్ తెలిపారు. ఇతర రాష్ట్రాలు స్పందించాల్సిన అవసరం ఉందని లీలా నందన్ తెలిపారు.

బఫర్ ఫర్ స్టాక్ నుండి కేజీకి-రూ. 26 – 28 చొప్పున ఉల్లిని కేంద్రం అందిస్తుంది. దీనికి రవాణా చార్జీలు కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం 30 రూపాయలకు ఇచ్చే అవకాశం ఉంది. ఖరీఫ్ సీజన్ లో సుమారు 37 లక్షల టన్నుల ఉల్లి పండించారని, అవి కూడా మార్కెట్ కు వస్తే రేట్లు తగ్గుతాయని చెప్పారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు