దేశంలో ఉల్లిపాయల కొరత ఏర్పడే అవకాశం

దేశంలో ఉల్లిధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం విదేశాలకు ఉల్లి ఎగుమతి నిలిపివేసింది. ఉల్లి అత్యధికంగా పండే మహారాష్ట్రలో భారీ వర్షాలు రావడంతో ఆ పంటకు అత్యధిక నష్టం వాటిల్లింది.. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు ఉల్లిపంట పూర్తిగా పాడైపోయింది. ఈ విషయాన్నీ గ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతిని నిలిపివేసింది. ఇక కృత్రిమ కొరత సృష్టించే వారిపై కూడా ఒక కన్ను వెయ్యాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..

కాగా గతేడాది ఇదే సమయానికి ఉల్లి రేట్లు విపరీతంగా పెరిగాయి.. కేజీ 80కి పైనే అమ్మారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి ప్రతిపక్షాలు. నిత్యావసరాల ధరలను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. ఇటివంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది

మీ అభిప్రాయం కామెంట్ చేయండి