అమెజాన్ ప్రైమ్ – కొత్తగా వచ్చిన ‘క్రావల్’ మూవీ చూడొచ్చా…?

amazon prime crawl movie review and rating

అమెజాన్ ప్రైమ్ ను రెగ్యూలర్ గా చూసే వారికి తాజాగా రిలీజ్ అయిన Crawl ( క్రావల్ ) అనే చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2019 లో వచ్చిన ఈ crawl చిత్రాన్ని amazon prime తాజాగా తన OTT లో రిలీజ్ చేసింది. మరి 1 గంటా 27 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఎలా ఉంది ? చూడదగినంత కథ, కథానాలు ఇందులో ఉన్నాయా అనేది తెలుసుకుందాం..

క్రావల్ మూవీ స్టోరీ

క్రావల్ చిత్ర స్టోరీ లైన్ చాలా చిన్నది. అమెరికా లోని తరచుగా వచ్చే హరికేన్ తుఫాన్ల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. అమెరికాలోని ఫోరిడాను హరికేన్ తుఫాన్ చుట్టుముడుతుంది. ఈ సమయంలో హేలీ అనే ఒక అమ్మాయి తప్పిపోయిన తన తండ్రిని వెతుక్కుంటూ తన తండ్రి ఉండే ప్రదేశానికి పోలీసులు చెప్పిన లెక్క చేయకుండా దొంగ చాటుగా వెళ్తుంది. చివరికి తన తండ్రి ఇంటి కింద ఉన్న అండర్ గ్రౌండ్ లో సృహ తప్పి పడిపోయి ఉంటాడు. తన తండ్రిని తీసుకోని బయటకు వెళ్లాలనుకు ప్రయత్నంలో వారి పెద్ద పెద్ద మొసళ్ళు దాడి చేయడం మొదలు పెడతాయి.

ఇక ఈ పెద్ద పెద్ద మొసళ్ల నుండి తండ్రి , కూతుర్లు ఎలా బయటపడ్డారు. వారిని రక్షించడానికి ఎవరు వచ్చారు..? వచ్చిన వారికి ఏమైంది అనేదే స్టోరీ.

క్రావల్ మూవీ స్టోరీ ఎలా సాగుతుంది

మనం ముందు చెప్పుకున్నట్టు ఇది చాలా చిన్న స్టోరీ లైన్. అయితే దాదాపు సినిమా మొత్తం తుఫాన్ , ఒక ఇళ్లు ,నీళ్లలోనే సాగుతుంది. సినిమా మొత్తం మీద మెయిన్ క్యారెక్టర్లు తండ్రి , కూతుళ్ళు వారితో పాటు ఒక కుక్క అంతే. మిగిలిన క్యారెక్టర్ల పాత్ర వాటి నిడివి చాలా చిన్నది. అయితే పూర్తి సినిమాను తుఫాన్ వాతావరణంలో తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. నిజమైన తుఫాను వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో సినిమా మొత్తం అలాంటి వాతావరణం సృష్టించడం చిన్న విషయం మాత్రం కాదు.

క్రావల్ మూవీలో బోర్ కొట్టించే అంశాలు 

సినిమా కథ కథనం ఒక్కచోటే తిరుగుతూ తండ్రి- కూతుళ్ల మాటలు అప్పుడప్పుడు వచ్చి వారి మీద దాడి చేసే మొసళ్ల గుంపు, వాటి నుంచి తప్పించుకోవడానికి వారు చేసే ప్రయత్నం.. ఇది మాత్రమే ఉండటం వల్ల సినిమాను ఫార్వాడ్ చేస్తూ చూడాలనిపిస్తుంది. చూసిన సీన్లనే మళ్లీ మళ్లీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. తర్వాత సీన్ లో ఏం జరగబోతుందనే విషయాన్ని ప్రేక్షకులు చాలా తేలికగా పసిగట్టడం ఇందులోని పెద్ద మైనస్.

అలాగే స్టార్టింగ్ లో ఎస్టాబ్లిష్ చేసిన స్విమ్మింగ్ పూల్ సీన్ చూసిన వారు సినిమా.. ఇలా ఉంటుంది అని ఊహించరు. భారీగా కాకపోయిన మెయిన్ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి క్రియేట్ చేసిన ఈ సీన్ మిగితా సినిమాతో సరిగ్గా కనెక్ట్ చేయకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. మొత్తానికి ఈ సినిమా ఫార్వాడ్ చేసుకుంటూ ఒక సారి చూడదగిన సినిమా అని చెప్పవచ్చు.

 

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు