నెట్ ఫ్లిక్స్ ని ఉండనివ్వరా ? ఇంటర్ నెట్ ను వేడెక్కిస్తున్న #CancelNetflix క్యాంపెయిన్ : Netflix ని బ్యాన్ చేయాలంటు డిమాండ్స్

#CancelNetflix campaign heats up over 'Mignonnes

ప్రముఖ OTT ప్లాట్ ఫాం అయిన నెట్ ఫ్లిక్స్ ను బ్యాన్ చేయాలనే ఒక క్యాంపెయిన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . #CancelNetflix అంటు లక్షలాది మంది సోషల్ మీడియాలో నెగటివ్ క్యాంపెయిన్ చేయడం మొదలుపెట్టారు. ఒక్క రోజులోనే దాదాపు 2 లక్షల మంది పైగా ట్విట్టర్ యూజర్లు #CancelNetflix అనే #ట్యాగ్ ను వైరల్ చేశారు.

ఫ్రెంచ్ డైరెక్టర్ మైమౌనా డౌకోర్ దర్శకత్వం వహించిన Cuties అనే చిత్రం సెప్టెంబర్ 9 న నెట్ ఫ్లిక్స్ లో విడుదలై ఈ వివాదానికి కారణం అయింది. ఈ సినిమాలో పిల్లల అశ్లీలత “Child sexual abuse ” ఎక్కువగా ఉండటంతో నెటిజన్లు ఇలా వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు.

నెట్ ఫ్లిక్స్ తరచుగా విడుదల చేసే చిత్రాలతో పోలిస్తే ఇందులో పెద్దగా అశ్లీలత ఏమి లేదు. అయితే అక్కడక్కడ వచ్చే కొన్ని సీన్లు పిల్లల అశ్లీలతను పెంచే విధంగా ఉండటంతో ఈ వివాదం మొదలైంది. పూర్తి స్థాయి నగ్న సన్నివేశాలు ఉన్న చిత్రాలు నెట్ ఫ్లిక్స్ లో అనేకం ఉన్నప్పటికి అవన్ని 18 + వయస్సు ఉన్న వారితో చిత్రీకరీంచినవి.

ఈ Cuties అనే చిత్రంలో మరీ దారుణమైన సన్నివేశాలు ఏమి లేనప్పటికి ఈ చిత్రం నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. అయితే ఈ చిత్రం పట్ల వచ్చిన నెగటివ్ టాకే ఈ చిత్రాన్ని ఎక్కువ మంది చూసేలా ప్రోత్సహించిందనేది మాత్రం వాస్తవం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు