వెబ్ సిరీస్ లో నటించేందుకు 90 కోట్లు తీసుకుంటున్న స్టార్ హీరో

ఓ వెబ్‌ సిరీస్‌ను ఏకంగా 250 కోట్లతో నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. భారీ యాక్షన్‌ సన్నివేశాలతో మొత్తం 6 ఎపీసోడ్లను

ఓటీటీ.. ఓవర్‌ ద టాప్‌ ప్లాట్‌ ఫామ్‌ మనదేశంలో నాలుగైదు నెలల నుంచే పుంజుకుంది. ఇప్పుడంటే చాలా వచ్చాయి కానీ.. అంతకుముందు మనకు తెలిసినవి అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌ వంటి ఒకటీ రెండు ఓటీటీలు మాత్రమే. అడల్ట్‌ కంటెంట్‌, విపరీతమైన అరాచకం, క్రైమ్‌, శృంగారం వంటి అంశాలే ప్రధానంగా సాగే వెబ్‌ సిరీస్‌లకు పెట్టింది పేరుగా మారిన ఓటీటీలు.. లాక్‌డౌన్‌ కాలంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. దీంతో దానిపై ఇండస్ట్రీ పెద్దల కన్ను పడింది. దాని మార్కెట్‌పై కూడా అంచనాకు వచ్చారు.

మనదేశంలో ఓటీటీ మార్కెట్‌ పుంజుకోడానికి చాలా సమయం పడుతుందని అనుకున్నా.. బడా ప్రొడ్యూసర్లంతా రంగంలోకి దిగడంతో.. నెలల కాలంలోనే టర్నోవర్‌ వేల కోట్లకు చేరుకుంది. ఇప్పుడప్పుడే థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడం.. ఒకవేళ ఓపెన్ చేసినా గతంలోలా ప్రేక్షకులు క్యూలు కట్టే పరిస్థితి లేకపోవడంతో.. నిర్మాణ సంస్థలు, ప్రొడ్యూసర్లు.. ఓటీటీ మార్కెట్‌ వైపు దృష్టి మరల్చారు.

ఓటీటీ బిజినెస్‌పై అంచనాకు వచ్చిన బడా ప్రొడ్యూసర్లు.. వందల కోట్లు పెట్టడానికి వెనకాడటం లేదు. బాలీవుడ్‌ హీరో హృతిక్‌రోషన్‌ కథానాయకుడిగా వస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌ను ఏకంగా 250 కోట్లతో నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. భారీ యాక్షన్‌ సన్నివేశాలతో మొత్తం 6 ఎపీసోడ్లను మాత్రమే చిత్రీకరించనున్నారు.

కేవలం 6 ఎపీసోడ్లలో నటించేందుకు హృతిక్‌రోషన్‌కు ముట్టజెప్పే పారితోషికం ఎంతో తెలుసా..? అక్షరాలా.. 90 కోట్లు. ఒక వెబ్‌సిరీస్ కోసం ఓ ఇండియన్‌ స్టార్‌ ఇంత పెద్ద మొత్తంలో అందుకోబోతున్న రెమ్యునరేషన్‌ ఇదే మొదటిదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు