In the Name of God : డిన్నర్ టైమ్ లో ఫ్యామిలి తో చూద్దాం అనుకుంటే మీరు బుక్ అయినట్టే : Aha 100 % తెలుగు కాదు – ఆహా 100% బూతు

in the name of god webseries

In the Name of God : Aha అంటే 100% తెలుగు అంటూ OTT రంగంలోకి వచ్చిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. పేరుకు తగినట్టుగానే అచ్చతెలుగు OTT కంటెంట్ తో ఆహా OTT కి మంచి మార్కులే పడ్డాయి. అనుకోని అతిథి, అనగనగా ఓ అతిథి, కంబాలపల్లి కథలు. 11th Hour అంటూ చక్కని ఫ్యామిలీ చూడదగిన సిరీస్ లన ఇచ్చిన Aha OTT ఇప్పుడు బూతును సైతం మెల్లిగా జనాల మీద రుద్దుతుంది. తాజాగా ఆహా OTT లో వచ్చిన ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ ( In the Name of God ) అనే వెబ్ సిరీస్ మొత్తాన్ని బూతుల నింపి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటుంది.

సిరీస్ మొత్తం బూతులే – ఫ్యామిలి తో చూడటం కష్టం

పోసాని కృష్ణ మురళి, నందిని రాయ్ , ప్రియదర్శి వంటి వారు కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ను దర్శకుడు పూర్తిగా బూతులతో నింపి వదిలిపెట్టాడు. ప్రియదర్శి, పోసాని ఉన్నారు కదా.. మంచి ఫ్యామిలి వెబ్ సిరీస్ అయి ఉంటుంది కదా అని , చక్కగా డిన్నర్ టైమ్ లో పెట్టుకోని కూర్చుంటే మీరు 100% బుక్ అయినట్టే. ఎందుకంటే ఆ స్థాయిలో బూతులు ఉన్నాయి. చివరి పోసాని, ప్రియదర్శి సైతం రెచ్చిపోయి మరి బూతులను జనం మీదకు వదిలేశారు. పల్లెటూర్లో ఆవారాగా తిరిగే వాళ్ళు కూడా నిజంగా ఇలా మాట్లాడుకుంటారో లేదో తెలియదు కాని, In The Name of God వెబ్ సిరీస్ లో మాత్రం ఛీ ఛీ అనిపించే బూతులు ఫుల్ గా ఉన్నాయి.

In the Name of God వెబ్ సిరీస్ పై తీవ్ర విమర్శలు

గతంలో డర్టీ హరి అనే చిత్రాన్ని తన OTT లో విడుదల చేసిన ఆహా పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ సినిమాలో మితి మీరిన బూతులు ఏమి లేనప్పటికి రాజకీయ రంగు పులుము కోవడంతో విపరీతమైన విమర్శలు వచ్చాయి. కాని ఇప్పుడు విడుదలైన In the Name of God వెబ్ సిరీస్ పై మాత్రం అనేక మంది సోషల్ మీడియా వేదికగా స్వచ్చందంగా స్పందిస్తున్నారు. ఈ స్థాయి బూతు కంటెట్ ను జనాలకు అందించడం కేవలం డబ్బు కోసమే అంటూ విరుచుకుపడుతున్నారు.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు