గుడిలో లిప్ లాక్ రొమాంటిక్ సీన్స్ – వివాదాలకు కేరాఫ్‌గా నెట్‌ఫ్లిక్స్‌

బుల్‌బుల్‌ అనే వెబ్‌సిరీస్‌ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ తీవ్ర ఆగ్రహావేశాలు

ఆన్‌లైన్ ఓటీటీ ప్లాట్ ఫామ్.. నెట్‌ఫ్లిక్స్‌ కాంట్రావర్సీకి కేరాఫ్‌గా మారుతోంది. గతంలో బుల్‌బుల్‌ అనే వెబ్‌సిరీస్‌ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమైన తర్వాత.. తాజాగా అదే నెట్‌ఫ్లిక్స్‌లో వస్తున్న ఏ స్యూటబుల్‌ బాయ్‌పై హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఓ ఆలయంలో ముద్దు సీన్‌ ఉండటం.. లవ్‌ జిహాద్‌ను ప్రోత్సహించే విధంగా ఉందంటూ ఈ సిరీస్‌ను బ్యాన్‌ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం.. ఏకంగా విచారణకు కూడా ఆదేశించింది.

అలనాటి తార.. మొన్నటి అలవైకుంఠపురంలో బన్నీ తల్లీగా నటించిన టబు.. ఈ వెబ్‌సిరీస్‌లో సైదాబాయి అనే ఓ వేశ్య పాత్రలో నటించింది. ఇషాన్‌ కట్టర్‌ అనే ఓ ముస్లీం అబ్బాయితో ఓ ఆలయంలో టబు రొమాన్స్‌ చేసిన సన్నివేశాలు చిత్రీకరించారు. దీనిపై హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. మీరా నాయర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సిరీస్‌పై బీజేపీ యువ మోర్చా సభ్యుడు గౌరవ్ తివారీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అతడిపై రేవా అనే పట్టణంలో ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైంది. దీనిపై మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తం మిశ్రా దర్యాప్తునకు ఆదేశించారు.

ఈ దృశ్యాలను మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌లో ఉన్న ఓ ఆలయంలో చిత్రీకరించారని.. అసభ్యకరంగా ఉన్న సన్నివేశాలను వెంటనే తొలగించాలని.. గౌరవ్ తివారీ డిమాండ్ చేశారు. దీంతో బ్యాన్‌ నెట్‌ఫ్లిక్స్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది. అయితే కొందరు మాత్రం వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు. ఖజురహో ఆలయాల వెలుపల ఉన్న చిత్రాలను చూపిస్తూ.. వ్యంగంగా పోస్టులు పెడుతున్నారు.

చాలాకాలం క్రితమే విడుదలైన ఈ వెబ్‌సిరీస్‌పై ఇప్పుడు వివాదం ముసురుకుంది. ఆన్‌లైన్‌ కంటెంట్‌పై సెన్సార్‌ ఉండకపోవడంతో.. విపరీతమైన అశ్లీలత, క్రైమ్‌ ఉన్న సిరీస్‌లు విడుదల చేస్తున్నారు. అందుకే ఇటీవల కేంద్రం ఇలాంటి వాటిపై చర్యలు తీసుకుంటామని.. ప్రకటించింది. ఓ గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు