వెబ్‌ సిరీస్‌ కు నిర్మాతగా ధోనీ

వెబ్‌ సిరీస్‌ కు నిర్మాతగా ధోనీ.. ఎవరికీ తెలియని ఓ ద్వీపంలో.. ఓ అఘోర తన జీవితాన్ని ఎలా గడిపారో ఈ సిరీస్‌ ద్వారా ఆవిష్కరిస్తున్నట్లు ఆకాశ్ గుప్తా తెలిపారు.

MS Dhoni produce web series
MS Dhoni produce web series

టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీ వైఫ్‌ సాక్షీ ధోనీ.. ఓ వెబ్‌ సిరీస్‌ను నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని రచయిత ఆకాశ్ గుప్తా తెలిపారు. తన తొలి పుస్తకం హిడెన్‌ హిందూ ఆధారంగా వస్తున్న వెబ్‌ సిరీస్‌ను నిర్మించేందుకు సాక్షీ ధోనీ ఒప్పుకున్నట్లు ఆయన ప్రకటించారు.

తన పుస్తకం ఆధారంగా వెబ్‌ సరీస్‌ తీసేందుకు చాలామంది నిర్మాతలను కలిసినట్లు ఆకాశ్ గుప్తా తెలిపారు.

తన కథకు న్యాయం చేస్తారనే నమ్మకాన్ని ఎవరూ కలిగించలేదని.. దీంతో చివరగా ధోనీస్ ప్రొడక్షన్‌ హౌజ్‌ను సంప్రదించినట్లు వివరించారు.

కొద్ది పాటి చర్చలతోనే తనకు కావాల్సిందేంటో వారు అర్థం చేసుకున్నారని.. ఆకాశ్ గుప్తా తెలిపారు. ఇదే విషయమై తాను సాక్షీ ధోనీతో మాట్లాడాలని అనుకున్నా.. కరోనా కారణంగా వీలు కాలేదని వివరించారు.

చివరగా వీడియో కాల్‌లో సాక్షీ ధోనీతో మాట్లాడినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కథనాన్ని, సిరీస్‌ను తీర్చిదిద్దే విధానాన్ని ఆమెకు వివరించినట్లు గుప్తా వెల్లడించారు. హిడెన్ హిందూ సాఫ్ట్‌ కాపీ ఒకటి ఆమె దగ్గర ఉందని.. సాక్షీతో మాట్లాడినందుకు సంతోషంగా ఉందన్నారు. ఎవరికీ తెలియని ఓ ద్వీపంలో.. ఓ అఘోర తన జీవితాన్ని ఎలా గడిపారో ఈ సిరీస్‌ ద్వారా ఆవిష్కరిస్తున్నట్లు ఆకాశ్ గుప్తా తెలిపారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు