ఆక్సీమీటర్ ధర రూ.514 మాత్రమే – ఎక్కువకు అమ్మితే కంప్లయింట్ చేయండి – ప్రభుత్వం ఆదేశాలు

ఆక్సీమీటర్, కరోనా మందుల అధిక ధరలపై నియంత్రణ చేయకపోతే ప్రజల్లో ఇప్పటికే పెరిగిన అసహనం.. అసహ్యంగా

కరోనా.. కరోనా.. ఈ వైరస్ వచ్చినదాని కంటే టెన్షన్ ఎక్కువ.. ఈ క్రమంలోనే ఎక్కువ మంది కరోనా రోగులు బ్రీతింగ్ కోల్పోతున్నారు.. పల్స్ రేట్ డౌన్ అవుతుంది.. ఇది చాలా ప్రమాదకరం.. బాడీలో పల్స్ రేట్ చెక్ చేసుకోవటానికి కావాల్సిన ఒకే ఒక్క పరికరం.. ఆక్సీమీటర్.. గతంలో దీని విలువ అస్సలు తెలియలేదు.. కరోనా వచ్చిన తర్వాత వెయ్యి రెట్ల అవసరం వచ్చింది.. ధర కూడా అమాంతం పెరిగింది. సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది..

ఒక్కో ఆక్సీమీటర్ రూ. 514 మాత్రమే :

ఆక్సీమీటర్ ధర విషయంలో నియంత్రణ లేకుండా పోయింది. ఇష్టమొచ్చినట్లు రేటు వసూలు చేస్తున్నారు. ఒక్కో ఆక్సీమీటర్ వెయ్యి, రెండు వేల రూపాయల వరకు పలుకుతుంది. అదేమంటే మంచి కంపెనీ అంటూ బ్రాండింగ్ పేరుతో దోపిడీ చేస్తున్నారు. మార్కెట్ లో దొరకటం లేదు.. డిమాండ్ ఎక్కువగా ఉంది.. నాలుగు రోజులు అయితే ఇది కూడా దొరకదు అంటూ మెడికల్ షాపులు, ఆస్పత్రి సిబ్బంది అధిక ధరలు వసూలు చేస్తున్నారు. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు, కంప్లయింట్ వెల్లువెత్తాయి ప్రభుత్వాలకు. ఈ క్రమంలోనే పంజాబ్ ప్రభుత్వం ముందుగా కళ్లు తెరిచింది. ఒక్కో ఆక్సీమీటర్ ధరను 514 రూపాయలుగా నిర్ణయించింది. నో లాస్ – నో ప్రాఫిట్ రూపంలో అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఇంత కంటే ఎక్కువ ధరకు ఆక్సీమీటర్ అమ్మితే కంప్లయింట్ చేయాలని కూడా జనానికి పిలుపునిచ్చింది.

మిగతా రాష్ట్రాలు కళ్లు తెరిచేది ఎప్పుడు :

పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం కూడా కళ్లు తెరిచింది. కరోనా వైద్య పరికరాల ధరల విషయంలో నియంత్రణ ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖకు సూచించింది. ఆక్సీమీటర్, ధర్మామీటర్, కరోనా కిట్ల విషయంలో ధరలను నిర్ణయించాలని సూచించింది. ఈ మేరకు కేంద్రం కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు, సలహాలు చేసింది. కరోనా మందులు, పరికరాల ధరలను నిర్ణయించి.. జనం దోపిడీ కాకుండా చూడాలని ఆదేశించింది.

ఆక్సీమీటర్ ఉపయోగాలు :

శ‌రీరంలోని వివిధ భాగాల‌కు ఆక్సీజ‌న్‌ ను గుండె ఎలా స‌ర‌ఫ‌రా చేస్తుందో ఈ ఆక్సీమీట‌ర్‌ ద్వారా తెలుసుకోవ‌చ్చు. ర‌క్తంలోని ఆక్సీజ‌న్ స్థాయి త‌గ్గి.. వ్యాధుల‌తో బాధ‌ప‌డే రోగుల‌ ఆరోగ్యాన్ని ప‌ర్య‌వేక్షించేందుకు దీన్ని ఉప‌యోగిస్తారు. ఆస్తమా, న్యుమోనియా, ఊపిరితిత్తుల క్యాన్స‌ర్‌, ర‌క్త హీన‌త‌, గుండె జ‌బ్బుల చికిత్స‌లో దీని అవ‌స‌రం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కరోనాకు కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి.. ఆక్సీమీటర్, కరోనా మందుల అధిక ధరలపై నియంత్రణ చేయకపోతే ప్రజల్లో ఇప్పటికే పెరిగిన అసహనం.. అసహ్యంగా మారే అవకాశం లేకపోలేదు..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి