పాక్ ప్రధాని సంచలన నిర్ణయం :- రేప్ కేసు నిందుతులది కట్ చెయ్యమని సూచన

ఇద్దరు పిల్లలతో కలిసి పాకిస్థాన్ లోని లాహోర్ హైవేలో బైక్ పై వెళ్తున్న మహిళను ఇద్దరు వ్యక్తులు గన్ తో బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టారు.. కాగా ఈ ఘటన పాకిస్థాన్ లో ప్రకంపనలు సృష్టించింది. దీనిపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. అత్యాచార కేసులో దోషిగా తేలిన వారిని బ‌హిరంగంగా ఉరి తీయాల‌న్నారు. లేదంటే ర‌సాయ‌నిక ప‌ద్ధ‌తిలో రేప్‌కు పాల్ప‌డిన‌వారి వృష‌ణాలు ప‌నిచేయకుండా చేయాల‌ని సూచించారు.

పాకిస్థాన్ లో బహిరంగ ఉరి తీయడానికి ఆదేశాలు ఉన్నాయి, కానీ వాణిజ్యపరమైన కారణాల వలన ఆ పని చెయ్యడానికి దైర్యం చేయడం లేదు.. ఈ నేప‌థ్యంలో కెమిక‌ల్ క్యాస్ట్రేష‌న్ ప‌ద్ధ‌తికి తాను మెగ్గుచూపుతున్న‌ట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. హ‌త్య‌ల్లో ఫ‌స్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థార్డ్ డిగ్రీ ఉన్న‌ట్లే.. రేప్‌కు పాల్ప‌డిన వారికి ఫ‌స్ట్ డిగ్రీలో భాగంగా వారి వృష‌ణాల‌ను తొల‌గించాల‌న్న సూచ‌న చేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి