నవ్వులపాలైన పాకిస్థాన్.. లేని రాయబారికోసం అసెంబ్లీలో తీర్మానం

నవ్వులపాలైన పాకిస్థాన్.. లేని రాయబారికోసం అసెంబ్లీలో తీర్మానం

పాకిస్థాన్ మరో సారి ప్రపంచ దేశాల ముందు నవ్వులపాలైంది. ప్రాన్స్ లో రాయబారిని వెనక్కి పిలిపించేందుకు పాక్ అసెంబ్లి ఏకగ్రీవ తీర్మానం చేసింది. అసలు విషయం ఏంటంటే ప్రాన్స్ లో అసలు పాకిస్థాన్ కు రాయబారి లేడు. ఈ విషయం తెలుసుకున్న అంతర్జాతీయ మీడియా పాక్ నిర్ణయంపై కామెడీలు పేరడీలు తయారు చేస్తుంది.

అసలు ఇలా జరగడానికి కారణం పరిశీలిస్తే. మహ్మద్ ప్రవక్త కార్టూన్ల ప్రచురణను సమర్థించడం ద్వారా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇస్లాంపై దాడి చేశారన్న పాక్ ప్రధాని ఇమ్రాన్.. ఆ దేశానికి వ్యతిరేకంగా జాతీయ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. మాక్రాన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ప్రాన్స్ లోని రాయబారిని వెనక్కి పిలవాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది.

ఆమోదించడం వరకు బాగానే ఉంది. అసలు ప్రాన్స్ లో తమ రాయబారి లేరనే విషయం చట్ట సభ సభ్యులు గాలికి వదిలేశారు. దీనిని చూసి ప్రపంచదే దేశాలు ముక్కున వెలుస్తున్నాయి. ప్రపంచాన్ని తికమక పెడదామని భావించి. ఫ్రాన్స్‌లో ప్రస్తుతం తమ రాయబారి లేరన్న విషయం ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీకి తెలిసినా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం గమనార్హం.

ఫ్రాన్స్ లోని తమ రాయబారిని పాక్ మూడు నెలల క్రితమే చైనాకు బదిలీ చేసింది. మూడు నెలల నుంచి అక్కడ ఆ పోస్ట్ ఖాళీగా ఉంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి