Pawan kalyan: చరిత్రలోకి వెళ్లి పప్పులో కాలేసిన పవన్

Pawan kalyan: హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో పవన్ కళ్యాణ్ అభిమానుల నడుమ ఆదివారం సాయంత్రం వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తోపాటు చిత్ర బృందం హాజరైంది. ఇక పవన్ భక్తుడు బండ్ల గణేష్ కూడా ఈ ఈవెంట్ కి వచ్చారు. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. కొద్దిసేపు పురాణాలూ వల్లెవేశాడు.

గణేష్ మాట్లాడుతున్నంత సేపు పవన్ నవ్వు ఆపుకోలేకపోయాడు. ఇక సినిమాను ఉద్దేశించి చాలామంది మాట్లాడారు. ఆ తర్వాత పవన్ మైక్ తీసుకోని మాట్లాడటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పవన్ చరిత్రలోకి వెళ్లారు. శ్రీకృష్ణ దేవరాయలు బ్రిటిష్ వారితో యుద్ధం చేశారని అన్నారు. అయితే ప్రస్తుతం పవన్ శ్రీకృష్ణ దేవరాయలగురించి మాట్లాడిన మాట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

శ్రీకృష్ణ దేవరాయలు బ్రిటిష్ వారితో యుద్ధం చేయడమేంటనీ ముక్కున వేలేసుకుంటున్నారు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన దేవరాయలు గొప్ప రాజు. ఈయన 1509 నుంచి 1529 వరకు హంపిని రాజధానిగా చేసుకొని విజయనగర సామ్రాజ్యాన్ని పాలించారు. కృష్ణదేవరాయలు 1529లో మరణించారు. అయితే బ్రిటిష్ వారు 1608 సంవత్సరంలో భారత దేశానికి వచ్చారు.

అంటే కృష్ణదేవరాయలకు, బ్రిటిష్ వారికీ మధ్య 80 ఏళ్ళ గ్యాప్ ఉంది. పవన్ ఈ వ్యాఖ్య చేయడంపై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు చెప్పబోయి పవన్ శ్రీకృష్ణ దేవరాయల పేరు చెప్పరేమోనని అనుకుంటున్నారు ఆయన అభిమానులు.

Pawan kalyan: చరిత్రలోకి వెళ్లి పప్పులో కాలేసిన పవన్

మీ అభిప్రాయం కామెంట్ చేయండి