మహిళా ఎస్ఐకి వేధింపులు – ఆత్మహత్యాయత్నం – సూపరింటెండెంటే కీచకుడు 

బాలకృష్ణన్ అంట. ఆయన వేధింపుల వల్లే ఈ అఘాయిత్యానికి

జనానికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్లే ఇలా చేస్తే ఇక జనం ఎవరికి చెప్పుకుంటారు.. ఖాకీ బట్టలేసుకున్న మహిళకే రక్షణ లేకపోతే.. పై అధికారే వేధింపులకు గురి చేస్తే ఎవరికి చెప్పుకోవాలి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘోరం కలకలం రేపుతోంది.

ఆంధ్రాలోని గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యాయత్నం చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ వేదింపులే కారణం అంటున్నారామె. నిద్రమాత్రలు మింగారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతుంది. ఇప్పటికి అయితే ఆరోగ్యం నిలకడగా ఉంది.. భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు వైద్యులు.

ఎక్సైజ్ మహిళా ఎస్ఐ గీత ఆత్మహత్యాయత్నం వెనక కారణం ఎవరో తెలుసా.. అదే డిపార్ట్ మెంట్ లో సూపరింటెండెంట్ గా పని చేస్తున్న బాలకృష్ణన్ అంట. ఆయన వేధింపుల వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు చెబుతున్నారు ఫ్యామిలీ మెంబర్స్.

ప్రాథమిక వివరాల ఆధారంగా సూపరింటెండెంట్ బాలకృష్ణన్ ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఘటనపై విచారణకు ఆదేశించింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి