మొబైల్ ఇండస్ట్రీ లో చైనా జోరు బాగానే ఉందని చెప్పాలి. చైనా కి సంబంధించిన స్మార్ట్ఫోన్ కంపెనీ Poco M- సిరీస్ సక్సెస్ అవ్వటం తో మరో కొత్త మొడెల్ మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. Poco M3 అనే పేరు తో మొబైల్ ఫోన్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయగా, ఇండియా మార్కెట్లోకి ఎపుడు వస్తుందో తెలియాల్సిఉంది. ఇది Poco M2 కి అప్గ్రేడ్ మోడల్ అని Poco కంపెనీ స్పష్టం చేసింది.
Poco M2, ఇండియా లో క్లిక్ అయ్యింది అనే చెప్పాలి, దీనితో Poco M3 లాంచ్ గురించి తెలిసినవెంటనే మొబైల్ ప్రియులకు ఎక్సపెక్టషన్ బాగా నే పెరిగింది.
Poco M3 కొత్త డిజైన్ తో , ఎక్స్టెండెడ్ కెమెరా అండ్ టెక్స్టర్డ్ బ్యాక్ పనెల్ తో రూపకరించబడింది. ఈ మోడల్ ప్రత్యేకత,హై కెపాసిటీ బ్యాటరీ 6,000mAh తో పనిచేస్తుంది అలాగే స్క్రీన్ సైజు 6.53″ (1080 X 23), ట్రిపుల్ కెమెరా సెటప్ అనేది ఇంకో అట్రాక్షన్, ప్రైమరీ 48MP, మాక్రో 2MP, డెప్త్ 2MP.
Poco M3 మొబైల్ కూల్ బ్లూ, Poco యెల్లో, పవర్ బ్లాక్ రంగుల్లో మార్కెట్లో లభిస్తుంది. మరో స్పెషలిటీ ఏంటంటే దీని బరువు 198 గ్రాములు అండ్ 9.6 మిల్లిమీటర్ తిక్నెస్ మాత్రమే.
కాస్ట్ విషయానికి వస్తే, 4జీబీ+ 64జీబీ స్టోరేజ్ పోకో ఎం3 ధర-11,000/-
4జీబీ + 128జీబీ స్టోరేజ్ ధర- 12,500/-