కేరళలో దారుణం :- యూత్ కాంగ్రెస్ కార్యకర్తను నేలకేసికొట్టి.. మీద కూర్చున్న పోలీస్

అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్య ఘటన అందరికి తెలిసే ఉంటుంది. ఓ నల్లజాతి వ్యక్తిని పోలీసు మెడపై కాలితో తొక్కి హత్యచేశాడు. అచ్చం అలాంటి ఘటనే కేరళ రాష్ట్రంలో జరిగింది. కానీ ఇక్కడ వ్యక్తి మృతి చెందలేదు. చిన్నపాటి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. కేరళలో గోల్డ్ స్కాం కేసు ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.. ఈ కేసులో ఇప్పటికే చాలామందిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు.

ఈ కేసులో విచారణకు హాజరు కావాలని రాష్ట్ర విద్యాశాఖామంత్రి కేటీ జలీల్ కు నోటీసులు పంపారు ఈడీ అధికారులు, ఆదివారం విచారణ నిమిత్తం వెళ్తున్న సమయంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన కాన్వాయుకి అడ్డువెళ్లారు. దింతో పోలీస్ అధికారి యూత్ కాంగ్రెస్ కార్యకర్తను కిందపడేసి అతడిపై కూర్చున్నాడు. కాన్వాయ్ వెళ్ళిపోయిన తర్వాత కానీ అతడిపైనుంచి లేవలేదు.. కాగా దీనికి సంబందించిన ఫొటోస్ వైరల్ గా మారాయి. కాగా పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చిత్రాలు చూసి అందరు జార్జ్ ప్లాయిడ్ హత్యోదంతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. వెంటనే పోలీస్ అధికారిని సస్పెండ్ చెయ్యాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వెల్లువెత్తతున్నాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి