నారా లోకేష్ పై రెండు కేసులు నమోదు

నారా లోకేష్ పై రెండు కేసులు నమోదు

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై రెండు కేసులు నమోదయ్యాయి. సోమవారం వరద బాధితులను పరమార్చించేందుకు లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లా వెళ్లారు. అక్కడ ట్రాక్టర్ నడిపారు.. ట్రాక్టర్ అదుపుతప్పి ఉప్పుటేరులోకి దూసుకెళ్లింది. కాగా ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఇక ఈ నేపథ్యంలోనే ఆకివీడు పోలీసులు లోకేష్ పై రెండు కేసు నమోదు చేశారు.

279, 184, 54A సెక్షన్ల కింద 15 మందిని ట్రాక్టర్ ఎక్కించుకుని, వారి ప్రాణాలకు హాని కలిగే విధంగా డ్రైవింగ్ చేసినందుకు ఒక కేసు, కోవిడ్ నిబంధనలు పాటించకుండా కార్యక్రమాలు నిర్వహించినందుకుగాను సుమోటోగా మరొక కేసు…మొత్తం రెండుకేసులు నమోదు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడుతున్నారు. పరామర్శించేందుకు వెళ్తే ఎటువంటి కేసులు పెట్టడం ఏంటని అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి