Ntv చైర్మన్ నరేంద్ర చౌదరిపై 420 చీటింగ్ కేసు నమోదు : రూ.100 కోట్ల స్కాం ఇది-జూబ్లిహిల్స్ పోలీసుల విచారణ..

ntv narendra chowdary

తెలుగు న్యూస్ ఛానల్ Ntv చైర్మన్, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు అయిన నరేంద్ర చౌదరిపై 420 చీటింగ్ కేసు నమోదైంది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఇన్ స్పెక్టర్ ఎస్.రాజశేఖర్ రెడ్డి.. ఏప్రిల్ 24వ తేదీ రిజిస్టర్ చేశారు. ఒక్క 420 చీటింగ్ కేసు మాత్రమే కాకుండగా ఎనిమిది సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. క్రైం నెంబర్ 237/2021 కిద.. సెక్షన్ 120-B, 406, 408, 409, 419, 420, 467, 468, 471, 477A సెక్షన్స్ కింద కేసు నమోదు అయ్యింది.

నరేంద్ర చౌదరితోపాటు జూబ్లీహిల్స్ సొసైటీలో గత 20 ఏళ్లుగా చక్రం తిప్పిన.. నరేంద్ర చౌదరి అనుచరులు ఎ.సురేష్ రెడ్డి, సీహెచ్ కృష్ణమూర్తి, డి.శ్రీనివాసరెడ్డి, ఎండీ జావీదుద్దీన్, బి.శిరీష, పి.శ్రీహరిపైనా కేసులు నమోదు చేశారు పోలీసులు.

ఫోర్జరీతో తప్పుడు రిజిస్ట్రేషన్.. ఏ1గా నరేంద్ర చౌదరి

అది 1988 మార్చి 25వ తేదీ. జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ద్వారా సీహెచ్ శిరీషాకు 853-ఎఫ్ ప్లాట్ (1,519 చదరపు గజాలు)ను కేటాయించారు. సొసైటీ బైలాస్ ప్రకారం ప్లాట్‌ను మూడేళ్లల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సీహెచ్ శిరీషా అమెరికా వెళ్లిపోవటంతో.. ఆ దేశానికి చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయారు. ఆ ప్లాట్ పై నరేంద్రచౌదరి కన్ను పడింది. బంజారాహిల్స్ సబ్ రిజిస్ట్రార్ మద్దతుతో ఎన్టీవీ నరేంద్ర చౌదరి, మరో ఏడుగురితో కలిసి సీహెచ్ శిరీషా పేరుతో తప్పుడు ఐడీ ఫ్రూఫ్ సృష్టించి.. ఫోర్జరీ సంతకంతో 2020 జూన్ 26న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

ఈ ప్లాట్‌ను సీహెచ్ శిరీషా నుంచి పి.శిరీషాకు గిఫ్ట్ డీడ్ ఇచ్చినట్టుగా మూడు రోజుల్లోనే మళ్లీ బదిలీ చేసుకున్నారు. 2020 జూన్ 29న (డాక్యుమెంట్ నెంబరు 2688/2020) మరోసారి రిజిస్ట్రేషన్ అయ్యింది. అమెరికా వెళ్లిన సీహెచ్ శిరీష అసలే ఇండియానే రాలేదని.. అలాంటిది ఎలా రిజిస్ట్రేషన్ అయ్యింది అనేది ఇక్కడ పాయింట్. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కొత్త కార్యదర్శి, TV5 మద్దతుదారుడు రవీంద్రనాథ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదుతో ఈ కేసు నమోదు అయ్యింది.

case on narendra chowdary

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు