రఘునందన్ రావు ఇంటిముందు ఉద్రికత్త.. భారీగా పోలీసుల మోహరింపు

రఘునందన్ రావు ఇంటిముందు ఉద్రికత్త.. భారీగా పోలీసుల మోహరింపు

దుబ్బాక నియోజకవర్గం రణరంగంగా మారుతుంది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ప్రతిపక్షాల పార్టీల నేతలపై దురుసుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం రఘునందన్ రావు వాహనాన్ని రోడ్డుపై మూడు గంటలపాటు నిలిపి తనిఖీ చేయడం. అంతే కాదు సోమవారం రఘునందన్ రావు కు చెందిన ఎనిమిది ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

రఘునందన్ రావు ఇల్లు, ఆయన కార్యాలయం, వారి అత్తగారి ఇంటితో పాటు. పలువురు సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే రఘునందన్ రావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏ సెక్షన్ కింద తన ఇంట్లో తనిఖీలు చేస్తున్నారో చెప్పాలంటూ పోలీసులను నిలదీశారు. కనీసం తన భార్యతో కూడా మాట్లాడనివ్వటం లేదని..

తన కుటుంబాన్ని ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తన ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు.. ఏం స్వాధీనం చేసుకున్నారో చెప్పాలంటూ ఆందోళనకు దిగారు. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటి నుంచి తనను టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసిందని రఘునందన్ రావు అన్నారు. ఈ దాడుల వెనుక మంత్రి హరీశ్ రావు ప్రమేయం ఉందని ఆరోపించారు.

 

ఇక ఆయన ఇంటి ముందు ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రఘునందన్ రావును ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి