పోర్న్ వీడియోల విషయంలో సంచలన నిర్ణయం.. ఇలా చేస్తే జైలుకే

దేశంలో నీలిచిత్రాలు (పోర్న్ వీడియోస్ ) చూసేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో వీక్షకుల సంఖ్య మరింత పెరిగినట్టుగా సర్వేలు చెబుతున్నాయి. అంతే కాదు ఆన్లైన్ లో అప్లోడ్ అవుతున్న పోర్న్ వీడియోస్ సంఖ్య కూడా పెరిగింది. అయితే ఈ వీడియోలను చూడటం వలన మహిళలు, చిన్నపిల్లలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని నిప్పులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లో పోర్న్ వీడియోలు, ఫొటోలు అప్‌లోడ్ చేసేవారి కఠిన చర్యలు తీసుకునేందుకు కర్ణాటక పోలీసులు ఉపక్రమించారు. గూగుల్ సాంకేతికత సాయంతో అటువంటి వారి ఆట కట్టించేందుకు పోలీసులు, నిఘా విభాగాలు ప్రణాళికలు సిద్ధం చేశాయి.

see this also :- 16 ఏండ్ల బాలికపై 60 ఏండ్ల వృద్ధుడు అత్యాచారం

ఎవరైనా ఆన్లైన్ లో వీడియోస్, ఫొటోస్ అప్లోడ్ చేస్తే గూగుల్ తమ సాంకేతికతతో వారి సమాచారాన్ని సేకరించి కేంద్ర హోంశాఖకు తెలుపుతుంది. హోం శాఖ నుంచి ఐపీ అడ్రస్‌ వివరాలు సేకరించి.. రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు దుండగులను కనిపెడతారు. ఇలా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఇలాంటి వీడియోలు, ఫొటోలు అప్‌లోడ్ చేసేవారిని టెక్నాలజీ ఆధారంగా గుర్తించి వారిని జైలుకు పంపేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. ఇక ఇటీవల ఏది పెద్ద బిసినెస్ గా మారిపోయింది. అంతే కాదు కొందరు ఏకాంతంగా ఉన్న వీడియోస్ తీసి ఆన్లైన్ లో పెడతామని బెదిరిస్తున్నారు. ఇటువంటి ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి