నటి కంగనా రనౌత్ మహారాష్ట్ర ప్రభుత్వంపై రాణి లక్ష్మీబాయిలా పోరాడుతుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఆమె వాయిస్ మహారాష్ట్ర సర్కార్ తోపాటు బాలీవుడ్ లోని మరికొందరిని టార్గెట్ చేసింది.. రాణి లక్ష్మీభాయి శౌర్యాన్ని, త్యాగాలను తాను సినిమా ద్వారా చూపించానంటూ, నిజజీవితంలోనూ తల వంచనంటూ ఇటీవల కంగనా రనౌత్ ట్వీట్ చేసింది. దీనిపై సినీనటుడు ప్రకాశ్ రాజ్ తనదైన రీతిలో స్పందించారు.
“ఒక్క సినిమాతో కంగనా రనౌత్ తనను రాణి లక్ష్మీబాయితో పోల్చుకుంటే మరి పద్మావతిగా నటించిన దీపికా పదుకుణె, అక్బర్ గా నటించిన హృతిక్ రోషన్, అశోకగా నటించిన షారుక్, భగత్ సింగ్ గా నటించిన అజయ్, మంగళ్ పాండేగా నటించిన ఆమిర్ ఖాన్, మోదీగా నటించిన వివేక్ ను కూడా ఆ గొప్పవారితో పోల్చొచ్చు” అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. కాగా కేవలం తాము నటులమనే విషయం మరిచి నాటినించిన పాత్రలోనే జీవిస్తున్నారనే ఉద్దేశంతో ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసినట్లు తెలుస్తుంది.
#justasking pic.twitter.com/LlJynLM1xr
— Prakash Raj (@prakashraaj) September 12, 2020