Pravaig మేడ్-ఇన్-ఇండియా లగ్జరీ EV కార్లు – రేంజ్ ఎంత అంటే?

Pravaig, బెంగుళూరు-బేస్ కంపెనీ తన మొట్టమొదటి మేడ్-ఇన్-ఇండియా లగ్జరీ EV కార్లు రూపొందించారు...Extinction MK1 ప్రీమియం ఎలక్ట్రిక్ మేడ్-ఇన్-ఇండియా కారును వచ్చే సంవత్సరము లాంచ్ చేస్తునట్టు తెలిపింది.

Pravaig

మేడ్-ఇన్-ఇండియా ప్రొడక్టులు కేవలం మొబైల్ ఇండస్ట్రీ, నిత్యావసరాల సరుకులుకు మాత్రమే కాదు ఇపుడు ఆటో-మొబైల్ రంగంలో కూడా ఒక  రేంజ్ లో ఇంపాక్ట్ క్రీయేట్ అయ్యింది. దీనితో పాటు మరో పక్క ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు జోరు మార్కెట్లో బాగానే ఉంది. ఇదే ఆసరా చేసుకుని Pravaig, బెంగుళూరు బేస్ కంపెనీ తన మొట్టమొదటి మేడ్-ఇన్-ఇండియా లగ్జరీ EV కార్లు రూపొందించారు. Extinction MK1 ప్రీమియం ఎలక్ట్రిక్ మేడ్-ఇన్-ఇండియా కారును వచ్చే సంవత్సరము లాంచ్ చేస్తునట్టు తెలిపింది.

ఇక లగ్జరీ కార్ ప్రత్యేకతలు గురించి చెప్పాలంటే..రేంజ్ 500kms వస్తుందని, అలాగే 30 నిమిషాలలో 80% వరకు తిరిగి భర్తీ చేయగలదు అని Pravaig తెలియచేసింది. మరిన్ని డీటెయిల్స్ లోకి వెళ్తే, ఈ కారు 96 kHw బ్యాటరీతో 200 hp మాక్సిమమ్ పవర్ మరియు టాప్-స్పీడ్ 196 kmph లభిస్తుంది. ఇంకా వేగం గురించి మాట్లాడితే 5. 4 సెకండ్స్ లో జీరో నుండి 100 kmph వరకు వెళ్లగలదు అని కంపెనీ వివరించింది. Extinction MK1 కార్ డిజైన్ గురించి తెలియాలి అంటే చూపుతిప్పుకోలేని విధంగా ఇండియన్ రోడ్స్ పై అరుదైన స్టైల్ తో కనువిందు చేస్తుంది అనే చెప్పాలి.

ల్యూసిడ్ ఎయిర్ EV పోలినట్టు Pravaig కార్ ఉండబోతుంది, ఫ్రంట్ అండ్ రేర్ LED బార్స్ ఉండటం వలన.. చుట్టూ ఎన్ని వాహనాలు ఉన్న Pravaig ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. Extinction MK1 లోపలి విభాగంలో లగ్జరీయస్ కేబిన్ ఉండగా, రిలాక్స్ అవుతూ డ్రైవింగ్ చేసే సౌకర్యం ఉంటుంది అని తెలిపింది. ప్రస్తుతానికి బెంగుళూరు అండ్ ఢిల్లీ లో అమ్ముడవుతాయని .. తరువాత మిగిలిన సిటీస్ లకు అందుబాటులో ఉంటుంది అని స్టార్ట్-అప్ కంపెనీ తెలిపింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి