ఇమ్యూనిటీని అమాంతం పెంచే “తులసి టీ”…ఇలా చేసుకోండి

health benifits of tulasi tea

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని ఒణికిస్తుంది. ప్రజల ఆరోగ్యంతో కరోనా చెలగాటమాడుతుంది. ఇటువంటి తరుణంలో మన రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ఎంతో అవసరం. కేవలం భోజనం చేయడం ద్వారా మాత్రమే రోగ నిరోధక శక్తి పెంచుకోలేము… ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిలో ఒకటి తులసి టీ.

మన వంటిట్లో దొరికే అతికొద్ది మసాలా దినుసులతో ఈ తులసి టీను తయారు చేసుకోవచ్చు. తులసి టీ తయారు చేసుకోవడం ఎంతో తేలిక మరియు తక్కువ సమయం పడుతుంది. ఈ తులసి టీ తయారు చేసుకునేందుకు ఏమి కావాలి… ఎలా తయారు చేసుకోవాలి మీరే చదవండి.

కావాల్సిన పదార్ధాలు:

తులసి ఆకులు : 5 – 10

దాల్చిన చెక్క పొడి : అర టీ స్పూన్

మిరియాల పొడి : పావు టీ స్పూన్

పచ్చి అల్లం : 5గ్రా లేదా నాలుగు చిన్న ముక్కలు

ఎండు ద్రాక్ష : 5

ఒక కప్పున్నర నీరు

తయారు చేసుకునే విధానం : ముందుగా ఒక గిన్నెలో నీటిని వేడి చేసుకోవాలి. అనంతరం ఒక్కో పదార్దాన్ని వేస్తూ కలియ తిప్పాలి. పదినిముషాలు బాగా మరిగించిన అనంతరం… నీరు కొద్దిగా చల్లారేంత వరకు అలాగే ఉండనివ్వాలి. అనంతరం వడపోసి… గోరువెచ్చగా ఉన్నపుడు తాగేయాలి. అవసరమైతే కొద్దిగా నిమ్మరసం, తేన, రెండు పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు. అయితే ఈ టీలో వాడిన పదార్ధాలవలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

తులసి

తులసిలో విటమిన్ సి మరియు జింక్ ఉన్నాయి, ఇది సహజ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఇంఫెక్షన్ల నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది.

శ్వాసకోశ లోపాలు లేదా జలుబు మరియు తరచుగా దగ్గుతో బాధపడేవారు తులసి ఆకులు నమలడం వలన ఉపశమనం లభిస్తుంది.

తులసిలో యాంటీఆక్సిడెంట్ గుణాలు కలిగిన ఫైటోకెమికల్స్ ఉన్నాయి, ఇవి నోటి, కాలేయం లేదా చర్మ క్యాన్సర్లను నిరోధిస్తాయి.

ప్రతి రోజు నాలుగు తులసి ఆకులు నమలడం వలన గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు

దాల్చిన చెక్క/పొడి :

ప్రకృతి అందించిన విశేషమైన ఔషధం దాల్చిన చెక్క. ఇది యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది, ఇది మన శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి కాపాడుతుంది. రోగాల భారిన పడకుండా దాల్చిన చెక్క నిరోధిస్తుంది. అంతే కాదు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు రోజువారీ ఆహారంలో భాగంగా దాల్చిన చెక్కను తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

మిరియాల పొడి :

మన భారతీయ వంటకాల్లో ప్రతి రోజు వాడుకునే మిరియాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మిరియాలలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా కలిగి ఉన్నాయి. ఇది మానవ కణాలలోని ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్ట తీవ్రతను నిరోధిస్తుంది. మిరియాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఆర్థరైటిస్, డయాబెటిస్ మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అల్లం :

అల్లం లేని వంటిల్లు ఉండదు. అల్లం మన వంటకాలకు గొప్ప రుచిని ఇవ్వడమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది. డయాబెటిస్ కు దివ్యఔషదంల పనిచేస్తుంది అల్లం. కణాల నష్టాన్ని నిరోధించే నిరోధక లక్షణాలను కలిగి ఉంది. కాన్సర్ నుండి రక్షించడంలోనూ అల్లం ఎంతో ఉపయోగపడుతుంది.

ఎండు ద్రాక్ష :

వందల సంవత్సరాలుగా భారతీయ ఆయుర్వేదంలో భాగంగా ఎండు ద్రాక్షను ఉపయోగిస్తున్నారు. ఇది దీర్ఘకాలిక అనారోగ్యం నుండి మనల్ని కాపాడుతుంది. యాసిడిటీని నియంత్రించడానికి ఎండు ద్రాక్ష ద్రావణం ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎండు ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి.

ఈ తులసి టీ మిశ్రమాన్ని తాగడం వల్ల శరీరం నుండి వచ్చే హానికరమైన వ్యర్ధాలను బయటకు నెట్టేయవచు. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఈ తులసి టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవడంతో పాటు, హానికరమైన వ్యాధుల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు