పాకిస్తాన్ లో మహిళా ఉద్యమం – ఫ్రెంచ్ మహిళపై గ్యాంగ్ రేప్ – నడిరోడ్డుపై – ప్రపంచ దేశాలు ఆగ్రహం

పాకిస్తాన్ లో అంతే.. అలాగే ఉంటుంది అని సోషల్ మీడియా కామెంట్లు చూసినప్పుడు నిజంగానా అనే డౌట్ వస్తుంది.. ఈ ఘటన చూసిన తర్వాత మాత్రం.. పాకిస్తాన్ అలాగే ఉంటుంది అని కాన్ఫామ్ అవుతోంది..

పాకిస్తాన్.. దాయాది దేశం.. శత్రుదేశం కూడా.. అక్కడ పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయో.. ఆ తర్వాత పోలీసులు ఎంత నీచంగా వ్యవహరిస్తారో ఈ ఘటన చాలు.. పక్క దేశం వాళ్లు చెబితే మనకు శత్రువులు అనుకోవచ్చు.. పాకిస్తాన్ మహిళలే ఆ దేశంలోని ఘోరాలపై తిరగబడ్డారు.. ఆందోళనలు చేస్తున్నారు.

ఘోరమైన ఘటన :

ఆమె ఓ ఫ్రెంచ్ దేశస్తురాలు. లాహోర్ లో నివాసం ఉంటుంది. 2020, సెప్టెంబర్ 10వ తేదీ రాత్రి తన ఇద్దరు పిల్లలను తీసుకుని కారులో లాహోర్ నుంచి గుజరన్ వాలా బయలుదేరింది. కొంత దూరం వెళ్లిన తర్వాత నడిరోడ్డుపై ఆమె కారును ఆపింది ఓ గుంపు. బయటకు దిగాలని కోరారు. ఆమె దిగలేదు.. హారన్ కొడుతూ సాయం కోసం చూసింది. ఎవరూ రాలేదు. ఆ దుర్మార్గులు వదల్లేదు.. కారు అద్దాలు పగలగొట్టి ఫ్రెంచ్ మహిళను బయటకు తీసుకొచ్చారు.. రోడ్డు పక్కన పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు.

ఆరుగురు వ్యక్తులు.. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు.. ఇదంతా కారులోని ఇద్దరు పిల్లలు చూస్తూ ఉన్నారు. వారు చిన్న పిల్లలు. తల్లి కోసం ఏడుస్తున్నారు.. అరుస్తున్నారు.. ఆ పిల్లలు కారు నుంచి బయటకు రాకుండా నీచులు అడ్డుకున్నారు. అత్యాచారం తర్వాత ఆమె దగ్గర ఉన్న డబ్బు, బంగారం, బ్యాంక్ ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు అన్నీ తీసుకుని వెళ్లిపోయారు.

పోలీస్ చీఫ్ ఏమంటాడో తెలుసా :

ఈ ఘటనపై లాహోర్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేసింది బాధితురాలు. దీనిపై విచారణ చేయాల్సి చీఫ్ పోలీస్ ఆఫీసర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. బాధితురాలిదే తప్పు అంటున్నాడు. పాకిస్తాన్ సమాజం అయితే.. రాత్రి సమయంలో మహిళలను బయటకు పంపించదు.. తమ చెల్లెల్లు, కూతుళ్లను ఎవరైనా రాత్రి సమయంలో బయటకు పంపిస్తారా అంటూ బహిరంగ ప్రకటన చేశాడు.

చీఫ్ పోలీస్ కామెంట్లపై పాకిస్తాన్ లోని మహిళలు భగ్గుమన్నారు. ఇది ప్రభుత్వమేనా.. వీళ్లు పోలీసులేనా.. ఓ విదేశీ మహిళలపై.. పిల్లల ఎదుటే గ్యాంగ్ రేప్ జరిగితే.. బయటకు ఎందుకు వెళ్లింది అని ప్రశ్నిస్తాడా.. వాడిని అప్పగిస్తే.. నడిరోడ్డుపై నరుకుతాం అంటూ రోడ్డెక్కారు లేడీస్.. పాక్ దేశంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో హడావిడిగా 15 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. వీళ్లు అసలు నిందితులు కాదని.. నకిలీ వాళ్లు అని జనం తిరగబడ్డారు. అసలు దోషులను వదిలేసి.. ఒత్తిడుల నుంచి తప్పించుకోవటానికి పోలీసులు నాటకం ఆడుతున్నారంటూ మహిళలు తిరబడ్డారు.

ఇక ఫ్రాన్స్ దేశం కూడా స్పందించింది. ఫ్రెంచ్ మహిళపై గ్యాంప్ రేప్ ఘటనపై యాక్షన్ తీసుకోకపోతే పద్దతిగా ఉండదని పాక్ దేశానికి వార్నింగ్ ఇచ్చింది.. పాకిస్తాన్ లో అంతే.. అలాగే ఉంటుంది అని సోషల్ మీడియా కామెంట్లు చూసినప్పుడు నిజంగానా అనే డౌట్ వస్తుంది.. ఈ ఘటన చూసిన తర్వాత మాత్రం.. పాకిస్తాన్ అలాగే ఉంటుంది అని కాన్ఫామ్ అవుతోంది..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి