అభిమానులను దారుణంగా మోసం చేసిన పునర్నవి

అభిమానులను దారుణంగా మోసం చేసిన పునర్నవి

సెలెబ్రెటీలు ఫేక్ పోస్టులు చెయ్యడం మాములే.. పబ్లిసిటీ కోసం వారి తంటాలేవో వారు పడుతుంటారు. పబ్లిసిటీ కోసం సెలెబ్రెటీలు చేసిన పోస్టులను చూసి అభిమాను పండుగ చేసుకుంటారు. ఏదైనా, విషాద వార్త అయితే బాధపడతారు. సంతోషకరమైన వార్త అయితే అభిమానులు పండగ చేసుకుంటారు.

అయితే రెండు రోజులుగా పునర్నవి ఆడిన పెళ్లి దోబూచులాట చాలా మందిని బాధపెట్టింది. కొందరిని మాత్రం ఆనందంలో ముంచేసింది. ఎంగేజ్మెంట్ అయిందంటూ పునర్నవి బుధవారం చేసిన ఓ పోస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేయగా, మరుసటి రోజు హబ్బీ ఫోటో కూడా పెట్టడంతో నిజమేనని నమ్మేశారు.. కానీ పునర్నవి చివరకు ఫాన్స్ ని ఫూల్స్ చేశారు.

ఓ లవ్ బేస్డ్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇలా చేసినట్లు ఈ రోజు తెలిపారు. ఎంగేజ్ మెంట్ లేదు.. పెళ్లీ లేదు.. అంతా వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా అని స్పష్టం కావటంతో అభిమానులు షాక్ అయ్యారు. రెండు రోజులుగా పెళ్లి గురించి వస్తున్న వార్తలు వైరల్ కావటం.. ఇప్పుడు అసలు విషయం తెలియటంతో.. అమ్మో పునర్నవి అంటున్నారు అందరూ. ఇక ఇలాంటి చీఫ్ పబ్లిసిటీ మానుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి