ఏపీలో పెరిగిన క్రిస్టియానిటీ.. 1.8 శాతం నుంచి 25 శాతానికి చేరింది – ఎంపీ

ఏపీలో పెరిగిన క్రిస్టియానిటీ.. 1.8 శాతం నుంచి 25 శాతానికి చేరింది – ఎంపీ

వైసీపీ అసమ్మతి ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రధానికి లేఖ రాశారు. రాష్ట్రంలో క్రైస్తవ మతం పెరిగిందని తెలిపారు. 2011 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.8 శాతం ఉండగా, ఇప్పుడు అది 25 శాతానికి చేరిందని లేఖలో పేర్కొన్నారు. అయితే ఇది ప్రభుత్వ రికార్డుల్లోకి రావడం లేదని చెప్పారు. ప్రజాధనాన్ని క్రిస్టియన్ మత వ్యాప్తికి ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనే అని చెప్పారు.

YSR Congress seeks disqualification of rebel Narasapuram MP K Raghu Rama Krishna Raju- The New Indian Express

రాష్ట్రంలో 30 వెల మంది చర్చి పోస్టర్లకు నెలకు రూ. 5 వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని రఘురాజు తెలిపారు. మతం మారిన వారు డిక్లరేషన్ ఇవ్వకుండా చట్ట సభలకు వస్తున్నారని చెప్పారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో దాదాపు 33 వేల చర్చిలు ఏర్పాటైనట్టు తమ వద్ద సమాచారం ఉందని తెలిపారు. హిందూ దేవాలయాలకు సమానంగా చర్చిలను ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. 2021 జనాభా లెక్కల్లో మతం మారినవారు లెక్కలు తేల్చాలని రఘురామా కృష్ణం రాజు ప్రధాని మోడీని కోరారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి