రాజీనామా చేస్తా.. లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తా.. మీకు దమ్ముంటే దీనికి ఒప్పుకోండి – రఘురామ

రఘురామకృష్ణం రాజు వైసీపీ నేతలు చేస్తున్న రాజీనామా సవాల్ కు కౌంటర్ ఇచ్చారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన, తాను ఎన్నికలకు వెళితే దాన్ని అమరావతిపై రెఫరెండంగా భావిస్తామని చెప్పాలని వైసీపీని డిమాండ్ చేశారు. అమరావతిపై రిఫరెండంగా ఎన్నిక జరిగితే కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని రఘురామకృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ రమ్మంటేనే తాను వైసీపీలోకి వచ్చానని స్పష్టం చేశారు.

తమ మధ్య విభేదాలకు కారణం ఎవరికీ తెలియదనని అన్నారు. కాగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి, బొత్స సత్యనారాయణ రఘురామకృష్ణం రాజు ఎంపీ పదవికి రాజీనామా చెయ్యాలంటూ అన్నారు. తాను తన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో నెగ్గితే… అమరావతినే రాజధానిగా కొనసాగిస్తానని సీఎం రాతపూర్వకంగా హామీ ఇచ్చేందుకు సిద్ధమేనా ? అని ఇటీవల ప్రకటించారు. తాజాగా తన రాజీనామా కారణంగా వచ్చే ఉప ఎన్నిక అమరావతిపై రిఫరెండంగా జరిగితే లక్ష మెజార్టీతో గెలుస్తానంటూ వైసీపీపై తన మాటల దాడిని మరింతగా పెంచారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి