రఘురామకృష్ణం రాజుకు కోపమొచ్చింది.. లైవ్ లోనే ఆగ్రహం వ్యక్తం

రఘురామకృష్ణం రాజుకు కోపమొచ్చింది.. లైవ్ లోనే ఆగ్రహం వ్యక్తం

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు. ఎదో ఒక విషయంపై ప్రతి రోజు మీడియాతో మాట్లాడుతున్నారు.. మీడియా సమావేశంలో అధికార పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. సొంతపార్టీ నేతలనే టార్గెట్ చేస్తున్నారు. ఢిల్లీలో ఓ చెట్టుకింద కూర్చొని ప్రతి రోజు మీడియా సమావేశం నిర్వహిస్తారు.. ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో రెండు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.

మొదట మీడియా సమావేశం ప్రారంభమైన 50 సెకండ్ల సమయంలో ఎవరో ఓ వ్యక్తి శబ్దం చేశాడు. దింతో రఘురామకృష్ణం రాజు హే అంటూ గరమయ్యారు. మరికొద్ది సేపటికి ఎవరో ఓ వ్యక్తి బులెట్ పై వెళ్తున్నాడు. దాని సౌండ్ భారీగా రావడంతో అతడెవరో ఆగమని చెప్పండి అంటూ కూసింత కోపంగా మాట్లాడారు.. ఈ అనూహ్య పరిణామాలు వీడియో చూస్తున్న వారికీ నవ్వు తెప్పించాయి.

వైసీపీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో అయిన ప్రాథమిక విద్య మాతృభాషలో ఉంటుందని తెలిపారు. పిల్లలకు మాతృ భాష తెలియకపోతే భవిష్యత్ లో తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయన అన్నారు.

 

https://www.facebook.com/watch/live/?v=677123523223076&ref=watch_permalink

మీ అభిప్రాయం కామెంట్ చేయండి