డ్రగ్స్ కేసులో రకుల్ పేరు.. షూటింగ్ నుంచి అర్దాంతరంగా వెళ్ళిపోయిన వైనం

చిత్ర పరిశ్రమకు డ్రగ్స్ వ్యవహారం అంటుకోవడం కొత్తెమికాదు.. గతంలో కూడా డ్రగ్స్ కేసులు వెలుగుచూశాయి.. ఇందులో కొందరు జైలుకు కూడా వెళ్లారు. ఇక తాజాగా సుశాంత్ మరణంతో డ్రగ్స్ వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ కేసులో అనుమానితులను ప్రశ్నించగా డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. దింతో విచారణ వేగవంతం చేశారు. విచారణలో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. అటు ఇటు తిరుగుతూ డ్రగ్స్ కేసు టాలీవుడ్ వరకు చేరింది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నట్లుగా రియా పోలీసుల విచారణలో వెల్లడించింది. మొత్తం 25 మంది పేర్లు చెప్పగా వీరిలో తెలుగు నటీనటులతోపాటు రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు సమాచారం.

ఇక తన పేరు బయటకు వచ్చిందని తెలియడంతో హైదరాబాద్ సమీపంలోని వికారాబాదులో షూటింగ్ లో ఉన్న రకుల్ షూటింగ్ ను ఆపేసి, అర్ధాంతరంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. షూటింగ్ లో పాల్గొనేందుకు మూడు రోజుల క్రితమే రకుల్ హైదరాబాదుకు వచ్చింది. రియా వెల్లడించిన యాక్టర్లందరికీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి