సోషల్ మీడియాలో sorryrakul #tag వైరల్.. కారణం ఇదే.. సమంత కూడా పోస్ట్ చేసింది..

ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ డ్రగ్స్ వ్యవహారం. సుశాంత్ మృతి తర్వాత చేపట్టిన విచారణలో డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో దాదాపు 25 మంది సినీతారల ప్రమేయం ఉందని వారిలో హీరోయిన్లు కూడా ఉన్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ లు ఉన్నారని వార్తలు వచ్చాయి. వారిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో దర్యాఫ్తు చేస్తున్న ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా, తాజాగా వివరణ ఇస్తూ, మాదకద్రవ్యాల కేసులో బాలీవుడ్ సెలబ్రిటీల జాబితా తమ వద్ద ఏమీ లేదని స్పష్టం చేశారు. తాము కేవలం డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారి పేర్లను తయారు చేశామని, ఇవన్నీ నటీనటుల పేర్లని తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు.

దీంతో అంతవరకూ రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ లపై విమర్శలు కుపిరించిన నెటిజన్లు, తమ తప్పు తెలుసుకుని ‘సారీ’ మెసేజ్ లు పెడుతున్నారు. ఈ క్రమంలో అందరు అభిమానుల తరఫున సమంత అక్కినేని, వారిద్దరికీ క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను పెట్టింది. ‘సారీ రకుల్’ అన్న హ్యాష్ ట్యాగ్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.

విషయం తెలియకుండానే వెబ్ సైట్లు న్యూస్ చానెళ్లు బ్రేకింగ్, న్యూస్ లు వేశాయి.. అసలు విషయం బయటకు రాగానే నాలుక కరుచుకున్నాయి. ఇక సారీ రకుల్ అంటూ #tags మొదలు పెట్టాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి