రకుల్ మౌనం వెనుక కారణం తెలిసింది..

డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ ఉన్నట్లుగా వార్తలు చెక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.. రియా విచారణ సమయంలో రకుల్ పేరు వెల్లడించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే రియా రకుల్ పేరు చెప్పలేదని ఎన్ సీ బీ ఉన్నతాధి కారి వెల్లడించారు. అయితే ఈ కేసు విషయంపై మాట్లాడడానికి ఎవరు ముందుకు రావడం లేదు. కారణం ఇందులో బడా రాజకీయ నాయకుల హస్తం ఉండటమే అని కొందరు అభిప్రాయ పడుతున్నారు .. ఈ నేపథ్యంలోనే రకుల్ ను మీడియా ముందుకు రాకుండా నిశ్శబదంగా ఉండమని చెప్పినట్లు తెలుస్తుంది. అయితే డ్రగ్స్ కేసు విషయంలో కంగనా కూడా ఏమి మాట్లాడటం లేదు. సుశాంత్ కేసులో బలంగా తన వానిని వినిపించిన కంగనా డ్రగ్స్ కేసు విషయానికి వచ్చే సరికి కొద్దిగా వెనక్కు తగ్గింది. ఇక రకుల్ తాజా ప‌రిణామాల‌పై స్పందించి కొత్త స‌మ‌స్య‌ల‌ను తీసుకురావ‌డం ఇష్టం లేక సైలెన్స్ గా ఉన్న‌ట్టు టాక్‌.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి