టాలీవుడ్ భళ్లాలదేవ.. దగ్గుబాటి వంశంలో రెండో తరం నాయకుడు.. రానా దగ్గుబాటి హార్ట్‌ఫుల్‌గా ఓపెన్ అయ్యారు. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై సరైన సమాధానమిచ్చారు. రీల్‌లైఫ్‌లో హీరోగా, విలన్‌గా చేసినా.. రియల్ లైఫ్‌లో మాత్రం హృదయాన్ని మెలిపెట్టే బాధను మోస్తున్నాడు. పాజిటివ్ ఆటిట్యూడ్‌తో.. అందరి చేత సూపర్ హీరో అనిపించుకుంటున్నాడు.
ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో అక్కినేని సమంత హోస్ట్‌గా వస్తున్న సామ్‌జామ్ ప్రోగ్రామ్‌లో గెస్ట్‌గా వచ్చిన రానా.. తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. చాలా సరదాగా సాగిన ప్రోగ్రామ్‌లో.. సమంత ఒక్కసారిగా ఆయన ఆరోగ్యంపై వాకబు చేశారు. తన ఆరోగ్యంపై లెక్కలేనన్ని ఆరోపణలు వచ్చాయని.. దీనికి సమాధానమేంటని ప్రశ్నించారు. దీనిపై సమాధానమిస్తూ రానా.. ఎమోషన్‌కు గురయ్యారు. అందరి చేతా కన్నీళ్లు తెప్పించారు.
చాలా ఫాస్ట్‌గా వెళ్తున్న తన జీవితంలో ఓ పాజ్ బటన్ వచ్చిందని మొదలుపెట్టిన ఆయన.. తన ఆరోగ్యంపై ఇంతవరకు ఎవరికీ తెలియని రహస్యాలు వెల్లడించాడు. తనకు పుట్టినప్పటి నుంచి బీపీ ఉందని.. అది గుండెకు సమస్యగా మారిందని చెప్పాడు. అలాగే కిడ్నీలు పాడవుతాయని.. మెదడులో నరాలు చిట్లేందుకు 70 శాతం అవకాశం ఉందని.. వైద్యులు చెప్పినట్లు తెలిపాడు. ఇలా ఇవన్నీ జరిగితే ప్రాణం పోయేందుకు 30 శాతం అవకాశం ఉన్నట్లు డాక్టర్లు చెప్పారంటూ తానే కన్నీటి పర్యంతమయ్యాడు.
రానా ఆరోగ్యంపై చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తారని.. ఆ సమయంలో అంత ధైర్యంగా ఉండటాన్ని తాను చూసినట్లు.. సమంత చెప్పింది. అందుకే రానా సూపర్ హీరో అని ప్రశంసించింది.
గతంలో జెమినీ టీవీలో మంచు లక్ష్మీ నిర్వహణలో వచ్చిన ఇలాంటి ప్రోగ్రామ్‌లో.. తన కళ్లపై ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. తనకు ఒకే కన్ను ఉందని.. దాని ద్వారానే ఈ ప్రపంచాన్ని చూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. రెండో కన్ను ఉన్నట్లు కనిపిస్తున్నా.. అది తనకు చీకటినే చూపిస్తుందని వివరించాడు.
కొత్తగా పెళ్లైంది.. హానీమూన్ కంప్లీట్ చేసుకున్నాడు.. మాంచి హుషారులో ఉన్నాడని అనుకునే లోపే.. గుండె బరువెక్కే న్యూస్ తీసుకొచ్చాడు. అందరి మనస్సులనూ ఓ క్షణం కదిలించాడు.