రాజ్ న్యూస్ లో రవిప్రకాష్

రాజ్ న్యూస్ లో రవిప్రకాష్

రాజ్ న్యూస్ ఛానల్ లోకి మీడియా బిగ్ బాస్ ఎంట్రీ కాబోతుంది. ఛానల్ ను ఐదేళ్లకు లైసెన్స్ తీసుకున్నారు రవిప్రకాష్. ఇందుకు సంబంధించి అన్ని చర్చలు కొలిక్కి వచ్చాయి. రాజ్ న్యూస్ యాజమాన్యం కూడా అంగీకారం తెలిపింది. సీఈవో, ఎడిటర్ ఇన్ చీఫ్ గా అడుగుపెట్టబోతున్నాడు. దీపావళికి స్క్రీన్ పై రవిప్రకాష్ కనిపించనున్నట్లు తెలుస్తోంది.

రాజ్ న్యూస్ తీసుకోవటం కన్ఫామ్ కావటంతో టీంపై దృష్టి పెట్టారు. తన దగ్గరే ఉన్న కొంత మందిని తొలి వెలుగులోనే ఉంచి.. కొత్త వారిని ఛానల్ లోకి తీసుకోనున్నట్లు సమాచారం. 50 – 50 బేసిక్ లో.. అనుభవం ఉన్న వారు 50 శాతం.. కొత్త వారు 50 శాతం ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారంట. కోర్ టీంలో మాత్రం పెద్ద ఛానల్స్ నుంచి తీసుకోబోతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఉన్న రాజ్ న్యూస్ మొత్తాన్ని మార్చేయనున్నారు. లొగో దగ్గర నుంచి కలర్స్ వరకు కొత్తగా మారనుంది. దీని కోసం గ్రాఫిక్ టీంతోపాటు ఎడిటోరియల్ విభాగాన్ని పటిష్టంగా చేయటానికి స్కెచ్ రెడీ చేస్తున్నారంట. దీనికి కావాల్సిన నిధులను బీజేపీ సమకూర్చనున్నట్లు సమాచారం. నిధులతోపాటు రాజకీయ మద్దతు ఇవ్వటానికి బీజేపీ అంగీకరించిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు తెలుస్తోంది.

రాజ్ న్యూస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అజెండాతో.. ఇక్కడ కేసీఆర్.. అక్కడ జగన్ పార్టీలకు ప్రత్యామ్నాయ ఛానల్ గా మార్చాలనేది లక్ష్యం అంట. నెంబర్ వన్ ఛానల్ నుంచి వచ్చి.. రేటింగ్ లో లేని ఛానల్ ను నెంబర్ వన్ చేయగలరా అనేది ప్రజంట్ డిస్కషన్ అయ్యింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి