తెలుగు సినిమాలో రియా చక్రవర్తి హీరోయిన్ – నిర్మాత దిల్ రాజు – ఎనిమిదేళ్లుగా ఇండస్ట్రీతో లింక్స్

ఆమె మొదటి సినిమా తెలుగులోనే. తూనీగ తూనీగ అనే మూవీలో హీరోయిన్ ఈ అమ్మడు. హీరో

రియా చక్రవర్తి.. దేశవ్యాప్తంగా ఈ పేరు తెలియనివారు ఉండరు.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్టరీలో కీలక సాక్షి.. డ్రగ్స్ కొన్నాను.. ఇచ్చాను అని సగర్వంగా ప్రకటించిన బ్యూటీ.. అరెస్ట్ అయ్యి జైలులో ఉంది.. విచారణలో రియా చెప్పిన విషయాలు తెలుగు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.

తూనీగ తూనీగ సినిమా హీరోయిన్ :

రియా చక్రవర్తి అంటే హిందీ హీరోయిన్ అనుకునేరు.. ఆమె మొదటి సినిమా తెలుగులోనే. తూనీగ తూనీగ అనే మూవీలో హీరోయిన్ ఈ అమ్మడు. హీరో సుమంత్ అశ్విన్. ఈ మూవీ 2012లో రిలీజ్ అయ్యింది. ఎం.ఎస్.రాజు డైరెక్టర్. కార్తీక్ రాజు సంగీతం అందించారు. తూనీగ తూనీగ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్. పరుచూరి వెంకటేశ్వరరావు, ప్రభు, నాగబాబు, విజయ్‌చందర్‌, సాయాజీ షిండే కీలక పాత్రల్లో కనిపిస్తారు ఈ మూవీలో.

నిర్మాత దిల్ రాజు – పెద్దగా ఆడలేదు :

తూనీగ తూనీగ మూవీ పెద్దగా ఆడలేదు. బిలో యావరేజ్ మూవీ. అందుకే పెద్దగా వెలుగులోకి రాలేదు రియా చక్రవర్తి. ఆ తర్వాత సినిమాలు కూడా రాలేదు. హిందీ ఇండస్ట్రీకి షిఫ్ట్ చేసింది తన దుకాణాన్ని రియా. నిర్మాత, దర్శకుడు అయిన ఎం.ఎస్. రాజు కుమారుడే సుమంత్ అశ్విన్. కొత్త సినిమా.. కొడుకుని హీరోగా పరిచయం చేస్తుండటంతో.. భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు ఈ మూవీని. నిర్మాత ఎవరో తెలుసా దిల్ రాజు. సమర్పణ కూడా దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి మూవీ రిలీజ్ అయ్యింది. కొత్త హీరోయిన్ కావాలని ముంబై నుంచి పట్టుకొచ్చారు. అప్పుడప్పుడే సినీ ఇండస్ట్రీలో ఎదుగుతున్న అమ్మాయి.. కొత్త ఫేస్ కావటంతో రియాను తీసుకున్నారు.

డ్రగ్స్ కేసులో అరెస్ట్ తో టెన్షన్ :

రియా చక్రవర్తికి 2012 నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీతో పరిచయాలు ఉన్నాయి. మొదటి సినిమా తూనీగతూనీగ కలిసిరాకపోయినా.. పరిచయాలు కంటిన్యూ చేస్తూ వచ్చింది. డ్రగ్స్ కేసు విచారణలో ఆమె ఫోన్ లో చాలా మంది తెలుగు హీరోలు, హీరోయిన్స్, నిర్మాతలు, దర్శకులు నెంబర్లు ఉన్నట్లు కూడా గుర్తించారు నార్కోటిక్ బ్యూరో అధికారులు. తెలుగు టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు స్వయంగా చెప్పింది రియా.. రకుల్ పేరు మాత్రమే చెప్పిందా.. ఇంకా ఎవరి పేర్లు అయినా ఉన్నాయా.. ఆమె ఫోన్ లో ఎవరి నెంబర్లు ఉన్నాయి.. ఎంత మందితో కాంటాక్ట్ లో ఉంది అనేది చర్చ.

మొన్ననే తెలుగు సినీ ఇండస్ట్రీ డ్రగ్స్ కేసు మాఫీ అయ్యింది.. హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంటున్న టైంలో రియా పేల్చిన డ్రగ్స్ బాంబ్.. ఏ విధంగా పేలుతుందో చూడాలి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి