డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. రకుల్ ప్రీత్ సహా మరో 25 మంది పేర్లు బయటపెట్టిన రియా చక్రవర్తి

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు బాలీవుడ్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీస్ ని కుదిపేస్తున్నాయి. సుశాంత్ మృతిపై ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా సీబీఐతో పాటు ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) రంగంలోకి దిగి కీలక ఆధారాలు సేకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సుశాంత్ ప్రియురాలు అదుపులోకి తీసుకోని విచారంచగా నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. దింతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కాగా ఆమె డ్రగ్స్ సరఫరాతో పాటు తాను వాడినట్లు పోలీసులు నిర్దారించారు.

ప్రస్తుతం ఆమె పోలీసుల కస్టడీలో ఉంది. ఆమెను విచారిస్తున్న కొద్దీ కొత్తకొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో డ్రగ్స్ రాకెట్‌లో ఊహించని విధంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ పేర్లు బయటకు రావడం సంచలనంగా మారింది.

డ్రగ్స్ తో సంబంధం ఉన్న వారిని ఒక్కొక్కటిగా ఆమె రివీల్ చేస్తున్న విషయాలు సినీ ఇండస్ట్రీని వణికిస్తున్నాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల ఇంటరాగేషన్‌లో దాదాపు 25 మంది సినీ ప్రముఖుల పేర్లు రియా బయటపెట్టినట్లుగా గత రెండు రోజులుగా మీడియాలో కథనాలు చూస్తున్నాం. డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్న వారిలో ఎక్కువగా బాలీవుడ్ అగ్ర హీరో హీరోయిన్లే ఉన్నట్లు తెలిసింది.

ఈమె వెల్లడించిన పేర్లలో డ్రగ్స్ మాఫియాతో మేజర్‌గా డీలింగ్స్ ఉన్న వారిలో బాలీవుడ్ భామలు సారా అలీ ఖాన్‌, సైమోన్ కంబట్టాలతో పాటు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఎన్‌సీబీ విచారణలో రియా చక్రవర్తి ఈ ముగ్గురి పేర్లు బయటపెట్టిందని సమాచారం.

ఇక రకుల్, రియా మధ్య మంచి స్నేహం ఉన్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఒక వేళ రాహుల్ డ్రగ్స్ వ్యవహారంలో తలదూర్చినట్లైతే.. తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులకు దీనిలో హస్తం ఉండే అవకాశం ఉంది

See Also : రియా.. రకుల్ కు ఇచ్చింది – రకుల్ ఎవరికి ఇచ్చింది – నోటీసులకు రంగం సిద్ధం

See also : రియా, రకుల్ తో మంచు లక్ష్మి ఫ్రెండ్ షిఫ్ – డ్రగ్స్ కేసులో ట్విస్ట్ – తెలుగు సినీ ఇండస్ట్రీలో కలకలం

మీ అభిప్రాయం కామెంట్ చేయండి