అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లాలో రహదారి రక్తమోడింది. జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామం వద్ద కారు- రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకరు డాక్టర్ గా తెలుస్తుంది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఇక గత కొద్దీ రోజులుగా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగింది. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

గుంటూరు జిల్లాలో కూడా కాలువలోకి కారు దూసుకెళ్లింది. అయితే రోడ్లు సరిగా లేకపోవడమే ప్రమాదానికి కారణమని ప్రజలు అంటున్నారు. వర్షాల కారణంగా రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. దింతో ప్రమాదాలు జరుగుతున్నట్లుగా ప్రజలు చెబుతున్నారు. అధికారులు స్పందించి రోడ్లు మరమ్మత్తులు చేయాలనీ వేడుకుంటున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి