RRR పై రగడ.. రాజమౌళి గారు ఏంటి ఇది? అంటున్న ఆదివాసీలు

RRR పై రగడ.. రాజమౌళి గారు ఏంటి ఇది? అంటున్న ఆదివాసీలు

RRR, భారీ అంచనాలతో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా.. వివాదాలకు అల్లంత దూరంలో ఉండే రాజమౌళి.. తాజాగా విడుదల చేసిన RRR టీజర్ ద్వారా వివాదంలో చిక్కుకున్నారు.. ఎన్టీఆర్ కుమ్రం భీం పాత్రలో నటించిన సన్నివేశాలను ఈ టీజర్ లో చూపించారు. అయితే చివర్లో ఎన్టీఆర్ ముస్లింటోపీ పెట్టుకొని కనిపిస్తారు.

దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుమ్రం భీం నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాడితే అతడికి ముస్లిం టోపీ పెట్టడం ఏంటని రాజమౌళిని ప్రశ్నిస్తున్నారు.. అయితే ఇది ట్విస్ట్ అని తెలుస్తుంది.. ఇక దీనిపై ఆదివాసీలు మండిపడుతున్నారు.. గోండు వీరుడిని ముస్లింగా ఎలా చూపుతారని ప్రశ్నిస్తున్నారు గోండులు.

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లోని కుమ్రంభీం ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి కుమ్రంభీం యువసేన నాయకులు క్షీరాభిషేకం చేసి నిరసన తెలిపారు. కుమ్రం భీంకు టోపీ పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని యువసేన జిల్లా అధ్యక్షుడు పెందూర్‌ ప్రభాకర్‌ అన్నారు. కొమురం భీం చరిత్రను పూర్తిగా తెలుసుకొని సినిమా తియ్యాలని తెలిపారు.

JR NTR as Komaram Bheem in SS Rajamouli's 'RRR' trends online, fans hail #RamarajuForBheem - Watch | Regional News | Zee News

ఇక వక్రీకరించడం వలన గిరిజనుల మనోభావాలు దెబ్బతింటాయని వారు అన్నారు. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాజమౌళిని హెచ్చరించారు. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ ఆరు పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తుంది. వీటిలో ఒకటే ముస్లిం పాత్ర అని సమాచారం..

ప్రేక్షకులకు ట్విస్ట్ ఇవ్వడానికే రాజమౌళి ఎలా టీజర్ డిసైన్ చేసినట్లు సమాచారం.. బాహుబలిలో కట్టప్ప, బాహుబలిని చంపిన విషయం కోసం శోదించినట్లే. RRR ఎన్టీఆర్ ముస్లిం క్యారెక్టర్ పై శోదిస్తున్నారంట నెటిజన్లు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి