శ్రావణి మృతిలో కొత్త ట్విస్ట్.. ఇద్దరినీ ప్రేమించింది.. చివరకు ఆత్మహత్య..

సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. శ్రావణి ఇద్దరినీ ప్రేమించినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. వీరిలో ఒకరు దేవరాజ్ కాగా మరొకరు సాయి కృష్ణారెడ్డి. మొదట శ్రావణి సాయిని ప్రేమించింది. ఆ తర్వాత దేవరాజ్ పరిచయం కావడంతో సాయిని దూరం పెడుతూ వచ్చింది. దింతో సాయి ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు.

ఇక ఈ ఆత్మహత్య విషయంపై పోలీసులు కథనం ఇలా ఉంది.. సెప్టెంబర్ 7 న దేవరాజ్, శ్రావణి ఎస్ఆర్ నగర్ లోని ఓ రెస్టారెంట్ కు వెళ్లారు. రెస్టారెంట్లో వీరిద్దరిని చూసిన సాయి ఆమెపై చెయ్యి చేసుకున్నాడు. దీంతో భయపడిన శ్రావణి ఇంటికెళ్లేందుకు ప్రయత్నించగా ఆటోకు అడ్డుపడి వాగ్వివాదానికి దిగాడు. మరో వాహనంలో శ్రావణి ఇంటికి చేరే లోపే ఆమె కుటుంబ సభ్యులకు ఈ విషయాన్నీ చేరవేశాడు. దింతో కుటుంబ సభ్యులు, సాయి కలసి శ్రావణిని విపరీతంగా కొట్టారు. తనను కొడుతున్న సమయంలోనే దేవరాజ్‌కు శ్రావణి ఫోన్ చేసింది. అతడు ఆ గొడవను రికార్డు చేశాడు. ఆ తర్వాత కాసేపటికే శ్రావణి బలవన్మరణానికి పాల్పడింది.

ఇద్దరిని ప్రేమించడం వల్లనే శ్రావణి తన జీవితాన్ని అర్దాంతరంగా ముగించాల్సి వచ్చినట్లు తెలుస్తుంది. కాగా ప్రస్తుతం దేవరాజ్. సాయి కృష్ణా రెడ్డి ఇద్దరు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఇక ఈ కేసులో మరో నిర్మాత కూడా ఉన్నట్లు తెలుస్తుంది. నిర్మాతను శనివారం విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి