సినిమా వాళ్లు మందుతోపాటు డ్రగ్ ప్యాకెట్లు ఇస్తారు : బాంబ్ పేల్చిన హీరోయిన్

వద్దు అంటే వినరు.. ఒక్కసారి ట్రై చెయ్యి.. బాగుంటుంది.. ఏమీ కాదు అంటూ బలవంతం చేస్తారు.. సినిమా పీపుల్ పార్టీల్లో

సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు విచారణ సంచలనంగా మారుతోంది.. ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు.. సినిమా వాళ్లలో 80 శాతం మందికి డ్రగ్స్ అలవాటు ఉందని రియా చక్రవర్తి ఇచ్చిన స్టేట్ మెంట్ కు మరిన్ని ఆధారాలు లభిస్తున్నాయి.

సినిమా పార్టీల్లో డ్రగ్స్ ఆఫర్ :

షెర్లిన్ చోప్రా.. అందమైన హీరోయిన్.. హిందీ సినిమా వాళ్ల పార్టీలు ఎలా ఉంటాయో చెప్పింది.. సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసింది. పార్టీలకు వెళితే.. ట్రేలలో మందుతోపాటు డ్రగ్ ప్యాకెట్లు కూడా ఉంటాయి.. మందు, సిగరెట్ కొట్టినట్లే.. డ్రగ్ కూడా ఇస్తారు.. వద్దు అంటే వినరు.. ఒక్కసారి ట్రై చెయ్యి.. బాగుంటుంది.. ఏమీ కాదు అంటూ బలవంతం చేస్తారు.. సినిమా పీపుల్ పార్టీల్లో డ్రగ్స్ కామన్.. ఓపెన్ ఆఫర్ ఉంటుంది.. ఎందుకంటే అక్కడికి ఎవరూ రారు.. పోలీసులు సైతం వచ్చే సాహసం చేయలేరు కదా అంటోంది.

చాలా సార్లు నాకు ఆఫర్ చేశారు :

సినిమా వాళ్ల పార్టీల్లో నాకు చాలా సార్లు డ్రగ్స్ ఆఫర్ చేశారు.. నేను వాటి జోలికి వెళ్లలేదు. నేను చైన్ స్మోకర్ ను.. 2017 స్మోకింగ్ కూడా వదిలేశాను.. ఇప్పుడు అంతా క్లీన్. మందు అప్పుడప్పుడు తాగుతాను.. సిగరెట్ మానేశాను.. డ్రగ్స్ అస్సలు తీసుకోదు అంటోంది షెర్లిన్ చోప్రా. రియా చక్రవర్తి చెప్పింది అక్షరాల నిజం అని.. సినిమా వాళ్ల పార్టీల్లో 80 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటారు అని స్పష్టం చేస్తోంది.

షెర్లిన్ డ్రగ్స్ బాంబ్ హిందీ ఇండస్ట్రీలో మళ్లీ డిస్కషన్ అయ్యింది.. ఇది ఎటువైపు దారితీస్తోంది.. ఎన్సీబీ ఎలాంటి విచారణ చేపడుతుందో.. ఎవరికి నోటీసులు ఇస్తుందో అని టెన్షన్ పడుతున్నారు సినీ వర్గాలు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి