Protest against farmers : దేశంలో రైతులంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుంది. రైతులు ఎక్కడైనా ధర్నాలు చేసిన, నిరసనలు చేపట్టిన వారికి సానుభూతి, ప్రజల నుండి మద్ధతు కచ్చితంగా లభిస్తాయి. గత కొంత కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ధర్నాకు సైతం ఇదే రకమైన మద్ధతు లభించింది. అయితే జనవరి 26న కొన్ని రైతు సంఘాల నేతలు చేపట్టిన అనాలోచిత చర్యల కారణంగా మొత్తం తలకిందులు అయింది. దేశవ్యాప్తంగా వారు చేసిన చర్యలపై వ్యతిరేఖత ఏర్పడింది. ధర్నాల్లో పాల్గొన్న కొన్ని రైతు సంఘాల ప్రతినిధులకే ఇది నచ్చకపోవడంతో సమ్మెను నుండి విరమించుకున్నారు.
ఇక ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాను చేపట్టిన నాటి నుండి చుట్టుపక్కల ఉండే అనేక ప్రాంతాల ప్రజలు రవాణా విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇక స్థానిక గ్రామాల రైతులైతే పంటను అమ్ముకోవడానికి కూడా తిప్పలు పడ్డారు. ముఖ్యంగా ధర్నా జరుగుతున్న ప్రాంతంలో ఉన్న సింఘూ ( singhu ) గ్రామస్థులు పడిన ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఇంత కాలం రైతులపై ఉన్న గౌరవంతో వాటిని భరించిన ఈ గ్రామస్థులు, జనవరి 26న జరిగిన ఒక్క ఘటన కారణంగా ధర్నా చేస్తున్న రైతులపై ఉన్న గౌరవం మొత్తం కోల్పోయారు.
A group of people, who claimed to be residents of #Singhuborder area in #Delhi, staged a protest and demanded farmers to vacate the area where they have been protesting for over 60 days.#FarmersProtest #FarmLaws #ITCard
More details here: https://t.co/QTVdB1pgul pic.twitter.com/fBG4zmeKVv
— IndiaToday (@IndiaToday) January 28, 2021
గురువారం మధ్యాహ్నం సమయంలో రోడ్ల మీదకు ర్యాలీగా వచ్చిన స్థానికులు, వెంటనే రైతులు ధర్నా స్థలాన్ని ఖాళీ చేసి వెల్లిపోవాలని డిమాండ్ చేశారు. రిపబ్లిక్ డే నాడు రైతులు చేపట్టిన చర్యలు దారుణంగా ఉన్నాయని, భారతీయ జెండాను వారు అవమానించారని స్థానికులు ఆరోపించారు. ట్రాక్టర్ ర్యాలీ పేరుతో వారు చేసిన చర్యలు, రైతులపైనే కాక వారు చేస్తున్న ధర్నాపై సైతం గౌరవం పోగొట్టిందని వెల్లడించారు. రైతులు ధర్నా చేపట్టిన స్థలంలో భారీగా ర్యాలీ తీసి, జై హింద్ అంటూ నినాదాలు చేస్తూ రైతుల ధర్నాకు వ్యతిరేఖంగా నిలిచారు.