ఇప్పుడే చూడండి – పాల తొట్టిలో స్నానం చేసిన కార్మికుడు : వైరల్ అవుతున్న వీడియో

turkey man takes bath in a tub of milk

టర్కీలోని ఒక పాల ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడు చేసిన పనికి  ఆ ఫ్యాక్టరీనే మూతపడింది. టర్కీకి చెందిన కోన్యా ప్రాంతంలోని ఆనాటోలియన్ ప్రావిన్స్ లో ఉన్న పాల డైరీ ఫ్యాక్టరీలో పని చేసే ఆ ఉద్యోగి భారీ సైజులో ఉన్న పాల ట్యాంక్ లో పడుకోని స్నానం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతని ఉద్యోగం పోవడంతో పాటు ఆ ఫ్యాక్టరీ సైతం మూతపడింది.

ఈ వీడియోని చూసిన స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్పందించిన స్థానిక అధికారులు ఆ ఫ్యాక్టరీని వెంటనే మూయించారు.

ఈ పని తమ ఫ్యాక్టరీ పేరును చెడకొట్టడానికి కావాలనే చేశారని యాజమాన్యం ఆరోపించింది. పాల తొట్టెలో స్నానం చేస్తున్నట్టు కనిపించిన సదరు వ్యక్తి  ఎమర్ సయ్యర్ కాగా ఆ వీడియోను రికార్డ్ చేసి టిక్ టాక్ లో అప్ లోడ్ చేసిన వ్యక్తి ఉగర్ తోగట్. వీరిద్దరిని అరెస్ట్ చేశారు.

వీడియోలో పాల స్నానం చేసినట్టు కనిపించినప్పటికి అవి నిజమైన పాలు కావని, పాల ట్యాంక్ లను క్లీన్ చేయడానికి ఉపయోగించే ఒక రకమైన లిక్విడ్ అని కంపెనీ చెబుతుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు