సోము వీర్రాజు మీడియాకు చెమటలు పట్టిస్తున్నాడు..

బీజేపీ మొన్నటి వరకు ఆంధ్ర ప్రదేశ్ లో పొత్తులలో పడి నలిగిపోయిన పార్టీ… జాతీయ పార్టీ అయినా ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చే సరికి దీనిని తోకపార్టీలాగే లెక్కకట్టేవారు.. ఇలా కావడానికి ఆ పార్టీ నేతలే కారణం అనేది బయటి మాట..కాగా ఏపీలో బీజేపీ గత కొద్దీ రోజులుగా పుంజుకుంటుంది

అధ్యక్షుడిగా సోము వీర్రాజు

ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సంఘ్ నుంచి వచ్చిన సోము వీర్రాజును జాతీయ అధ్యక్షుడు నడ్డా నియమించారు. సోము వీర్రాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఇద్దరు మంచి మిత్రులు, వారి మధ్య ఉన్న స్నేహం.. సోము వీర్రాజులో ఉన్న దూకుడు తనం ఆయనను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని చేసింది.. సోము పార్టీ పగ్గాలు చేపట్టిన నాటినుంచి పార్టీలో కొత్త జీవం వచ్చినట్లు కనిపిస్తుంది. సొంతంగా 18 శాతం ఓటుబ్యాంక్ ఉన్న బీజేపీ పొత్తుల వలలో చుక్కుకొని చితికిపోయింది. 2019 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1.9 శాతం ఓటు షేర్ మాత్రమే సాధించింది. ఒక్క చోట కూడా విజయం సాధించలేదు.

టీవీ డిబేట్లలో చుక్కలు చూపిస్తున్న సోము వీర్రాజు

టీవీ ఛానల్స్ డిబేట్ కి వచ్చిన తరుణంలో వీర్రాజు డిబిట్ లో అడుగుతున్న ప్రశ్నలకు దూకుడుగా సమాధానం చెబుతున్నాడు. చంద్రబాబు వెనకేసుకొచ్చే చానెళ్లు సోమును ఇరకాటంలో పెట్టాలని తెగ ఆరాటపడుతున్నాయి. కానీ ఆయన మాత్రం జంకు లేకుండా మాట్లాడుతున్నాడు. అవసరమైతే మాటలతో అవతలి వారి నోరు మూయిస్తున్నారు.. పచ్చకండువా మేడలో వేసుకొని ప్రశ్నలు వేస్తున్నారంటూ డిడేట్ చేసేవారిపై గర్జిస్తున్నారు. ఎవరైనా బీజేపీపై తప్పుడు కథనాలు రాస్తే ఆ న్యూస్ పేపర్ ఎడిటర్ కి లేఖలు రాస్తున్నారు. ఇంత చురుకుగా ఏ పార్టీ అధ్యక్షుడు కూడా పనిచెయ్యడం లేదు అనడంలో సందేహం లేదు..

పార్టీ వ్యవస్థాగత నిర్మాణంపై దృష్టి

పార్టీని బూత్ స్థాయి నుంచి బలంగా తయారు చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇదే సమయంలో ఎవరైనా బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తే దాడి చేసిన వారికి గట్టి సంకేతాలు పంపుతున్నారు. బీజేపీ కార్యకర్తలను ఏకం చెయ్యడంలో సోము విజయం సాధించారని చెప్పవచ్చు..ఇక సోము వీర్రాజు బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీలో జోష్ పెరిగింది.

కార్యకర్తలను కలుపుకుపోవడంలో శ్రద్ద

పార్టీకి వెన్నుముక్క కార్యకర్త.. కార్యకర్త లేనిది ఏ పార్టీ ఉండదు.. అలాంటిది వారిని విశ్మరిస్తే పార్టీకి పెను ప్రమాదం.. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి కార్యకర్తను కలిసేందుకు ఆయన కృషి చేస్తున్నారు. కార్యకర్తలు సందేశం పంపినా వెంటనే రిప్లై ఇస్తున్నారు. అందరిని వ్యక్తిగతంగా కలవలేకపోయినా సోషల్ మీడియా ద్వారా దగ్గరవుతున్నారు.

మొదటగా బీజేపీపై విషప్రచారం చేస్తున్న మీడియా ఛానెళ్లపై సోమువీర్రాజు దృష్టిపెట్టారు. వారు అడిగే ప్రతి ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం చెబుతున్నారు. మీడియాను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు.. చౌకబారు ప్రశ్నలు వేస్తున్న హోస్టులకు గట్టిగా సమాధానం చెబుతున్నారు వీర్రాజు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి