రాజమౌళికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బీజేపీ ఎంపీ

రాజమౌళికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బీజేపీ ఎంపీ

రాజమౌళి ఆర్ఆర్ఆర్ టీజర్, వివాదాస్పదమవుతోంది. చాలామంది టీజర్ ను వ్యతిరేకిస్తున్నారు. ఎన్ఠీఆర్ ముస్లిం వేషధారణలో కనిపించడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీ సోయం బాపురావు రాజమౌళిపై మండిపడ్డారు.

కొమురం భీం పాత్రలో ధరించిన ముస్లిం టోపీని తొలగించాలని డిమాండ్ చేశారు. నైజాం రాజులకు, రజాకార్లకు వ్యతిరేకంగా కొమురం భీం పోరాటం చేశారని ఆయన తెలిపారు. నైజాం రాజుల చేతిలో చనిపోయిన భీంకు ముస్లింలు ధరించే టోపీ పెట్టటం ఏంటని రాజమౌళిని ప్రశ్నించారు. డబ్బుకోసం సినిమా తీసేముందు చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు.

తీసెయ్యకపోతే ఆదివాసీల దెబ్బె చూపెడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ వీరుడికి ముస్లిం తలపాగా పెట్టి పెద్ద తప్పు చేశారని మండిపడ్డారు. తియేటర్లు తగలబెడతామని హెచ్చరించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు