ముగినిసిన మారడోనా చరిత్ర!!!

హార్ట్ ఎటాక్ తో ఫుట్ బాల్ క్రీడాకారుడు మారడోనా కన్నుమూత

మారడోనా

గోల్ కోడితే మిస్ అయ్యే ఛాన్స్ లేదు…. 17 సంవత్సరాలతో తన ఫుట్ బాల్ ఆట తో కెరీర్  రాణించి, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించి, కొన్ని లక్షల మందికి ఆదర్శంగా నిలిచిన ఏకైక వ్యక్తి డీగో మారడోనా. బాల్ ని పరిగెత్తిచాలన అతనే… గోల్ కొట్టాలన్న అతనే… ఇంకా ఎన్నో విషయాలు అతని గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు.

ఈ ప్రముఖ ఆర్జెంటినా ఫుట్ బాల్ ప్లేయర్ ఇక లేరు …. కార్డియాక్ అరెస్ట్ తో తన ఇంట్లోనే మరణించారు. శోకసంద్రంలో అభిమానులు కృంగిపోయారు, సెలెబ్రిటీలు అతనితో ఉన్న క్షణాలను సోషల్ మీడియా ద్వారా గుర్తుచేసుకుంటున్నారు.

మారడోనా ఆట తీరు ఫుట్ బాల్ లవర్స్ కి ఒక మంచి కిక్ ను ఇస్తుంది, ఎందుకంటే అతను ఫుట్ బాల్ ను ఆలా అలవోకగా నడుస్తూ, పరిగెత్తుతూ , గాల్లో ఎగరేస్తూ ఈజీ గ ఆడేస్తాడు. మరో స్పెషల్ టాలెంట్ ఏంటంటే గ్రౌండ్ లో అతని మిడ్ ఫీల్డర్గ అటాకింగ్ పద్దతి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

5 అడుగుల …. 5 అంగుళాల ఎత్తు ఉన్న మారడోనా,  వేగంతో ప్రత్యర్థులను మాయ చేసి గోల్స్ కొట్టే సత్తా ఉన్న క్రీడాకారుడిగా పేరు పొందాడు. మారడోనా దూకుడుతో ఎవరికీ సాధ్యం కానీ గోల్స్ ని చూడముచ్చటగా వేసేవాడు ..అది అంత ఆట పై ఉన్న ప్రేమ వల్లనే సాధ్యమైందని చెప్పాలి. అతని పోరాటంలో ఎన్నో అవోరోధాలు ఎదురైనా .. ఫుట్ బాల్ చరిత్రలో మరవని ఒక తియ్యటి జ్ఞాపకం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు